Share News

నాణ్యత లేని ఆహార పదార్థాలు పంపిణీ చేస్తే చర్యలు

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:31 PM

నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కర్ణాకర్‌ అన్నారు.

నాణ్యత లేని ఆహార పదార్థాలు పంపిణీ చేస్తే చర్యలు

  • హోటళ్లలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు

  • ఒక కేసు నమోదు, ఇద్దరికి నోటీసులు

గద్వాల క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కర్ణాకర్‌ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివా రం టీజీ సేఫ్‌ ఆధ్వర్యంలో హోటల్స్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నాణ్యత లేని హోటళ్లపై తనిఖీలు నిర్వహించి, ఒక కేసు నమోదు చేశారు. అలాగే ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. ఇందులో గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపంలో ఉన్న చెగువేర ఫుడ్‌ కోర్టు, గద్వాల జిల్లా కేంద్రంలోని ఫుడ్‌ వరల్ట్‌ రెస్టారెంట్‌, హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్‌పై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడంతో పాటు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార పదార్థాలలో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Nov 22 , 2026 | 11:31 PM