Share News

విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:13 AM

విద్యా ర్థులకు అసౌకర్యాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్సీవో శ్రీనివాస్‌గౌడ్‌, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నా గరాజులను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీ కృష్ణ హెచ్చరించారు.

విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు

- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- జ్యోతిరావు ఫూలే కళాశాలను తనిఖీ

కందనూలు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : విద్యా ర్థులకు అసౌకర్యాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్సీవో శ్రీనివాస్‌గౌడ్‌, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నా గరాజులను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీ కృష్ణ హెచ్చరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని శ్రీపురం శివారులో జ్యోతిరావుఫూలే కళాశాలలో ఇటీవల ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య ఘటన సందర్భంగా ఎమ్మెల్యే ఆది వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వం డిన భోజనాలను, కూరగాయలను పరిశీలించారు. మెనూ ప్రకారం మటన్‌ ఉండాల్సి ఉండగా ఎందుకు వండలేదని ప్రశ్నించారు. కళాశాలలో 376మంది ఉండా ల్సి ఉంటే 125మంది మాత్రమే ఎందుకు ఉన్నారని ప్ర శ్నించారు. అధ్యాపకుల పనితీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల అధ్యాపకుల వేధింపు వల్లనే విద్యా ర్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన పేర్కొన్నా రు. ఇద్దరు అధ్యాపకులను ఒక ప్రిన్సిపాల్‌ను బదిలీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అం తకుముందు బల్మూరు మండలంలోని జిన్‌కుంట గ్రా మంలో బాధిత కుటుంబ సభ్యులను పరమార్శించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ తీగల సురేంద్ర, వైస్‌ చైర్మన్‌ బాదం రమేశ్‌, నాయకులు ఉన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 12:13 AM