లంచం తీసుకున్నవారిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:30 PM
పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీళ్లను తీసుకెళ్తుండగా ఆర్టీఓ అధికారు లమంటూ భయపెట్టి జరిమానా రూపంలో డ బ్బులు తీసుకున్నారని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కుర్వ పల్ల య్య డిమాండ్ చేశారు.
కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు
గద్వాల, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీళ్లను తీసుకెళ్తుండగా ఆర్టీఓ అధికారు లమంటూ భయపెట్టి జరిమానా రూపంలో డ బ్బులు తీసుకున్నారని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కుర్వ పల్ల య్య డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అలా గే ఆర్టీఓ అధికారులు వేధిస్తున్న తీరును కలెక్ట ర్కు వివరించారు. అయిజ మండలం తుపత్రా ల గ్రామ వాగు నుంచి రైతులు పంటలను కా పాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీళ్లను తీసు కొని వెళ్తుండగా ఆర్టీఓ అధికారులు ఫైన్ల పేరుతో వేధించి ఒక్కోరైతు నుంచి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేశారని తెలిపారు. డబ్బు తీసుకున్న ఎంవీఐ అధికారుల ను ఆర్టీఓ రక్షించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని తెలిపారు. తక్షణమే అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతు సంఘాలు, రైతు వామపక్షవాదులతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో స్వామి, మహేశ్, రఘు ఉన్నారు.