Share News

పంటల నష్టంపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:00 AM

మక్తల్‌ - నారాయణపే ట- కొడంగల్‌ ఎత్తిపోత ల పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో కాం ట్రాక్టర్లు పైపులైన్‌ కోసం చేపట్టిన పనుల కార ణంగా రైతులు వేసుకు న్న పంటలపై మొర్రం, రాళ్లు, మట్టి పైపులు వే స్తూ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి అన్నారు.

పంటల నష్టంపై చర్యలు తీసుకోవాలి
లింగారెడ్డిపల్లిలో రైతు పొలంలో వేసిన పైపులను పరిశీలిస్తున్న నిర్వాసితుల సంఘం నాయకులు, గ్రామ రైతులు

దామరగిద్ద, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : మక్తల్‌ - నారాయణపే ట- కొడంగల్‌ ఎత్తిపోత ల పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో కాం ట్రాక్టర్లు పైపులైన్‌ కోసం చేపట్టిన పనుల కార ణంగా రైతులు వేసుకు న్న పంటలపై మొర్రం, రాళ్లు, మట్టి పైపులు వే స్తూ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆది వారం లింగారెడ్డిపల్లి గ్రామంలో పొలాలను పరిశీలించి మాట్లాడారు. పైపులైన్‌ పనులను 60 ఫీట్ల వెడల్పుతో చేపట్టాల్సి ఉండగా కాం ట్రాక్టర్లు నిర్లక్ష్యంగా 8 ఫీట్ల వరకు రైతుల పొ లాలను ధ్వంసం చేసి వాడుకుంటున్నారన్నారు. నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొ ని రైతులకు న్యాయం చేయాలని సంబంధిత అ ధికారులను డిమాండ్‌ చేశారు. దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లి శివారులో మక్తల్‌ - నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పైపులైన్‌ పనులను స్వయంగా నిర్వాసితుల సంఘం బృందం పరిశీలిచింది. కార్యక్రమంలో ధర్మరాజు గౌడ్‌, నారాయణ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:00 AM