Share News

లావణ్య మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:20 PM

ప్రేమపేరుతో మోసగించి పెళ్లికి నిరాకరించినందుకు ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌ లావణ్య మృతికి కారణమైన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

లావణ్య మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

  • కలెక్టరేట్‌ వద్ద బాధిత కుటుంబ సభ్యుల నిరసన

గద్వాలన్యూటౌన్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ప్రేమపేరుతో మోసగించి పెళ్లికి నిరాకరించినందుకు ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌ లావణ్య మృతికి కారణమైన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చే స్తూ సోమవారం బాధిత కుటుంబ సభ్యులతో పాటు వివిధ సంఘాల నాయకులు కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన డాక్టర్‌ లావణ్య మృతితో తమ కుటుంబం రోడ్డున పడిందని, ప్రేమపేరుతో ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. తన ఇంకో కుమార్తె ఎంబీఏ పూర్తి చేసిందని ఆమె ఉద్యోగం ఇచ్చి తమ కుటుంబానికి జీవనాధారం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఉన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 11:20 PM