పర్యాటక జంక్షన్‌గా అచ్చంపేట
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:55 PM
రాబోయే రోజుల్లో అచ్చంపేటను పర్యా టక జంక్షన్‌గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
- ఎలివేటెడ్ కారిడార్, బుల్లెట్ రైలు జంక్షన్ల రాకతో మహర్దశ
- వివిధ పథకాలకు రూ. లక్షా 64 వేల కోట్ల పంపిణీ
- ఎవరు చర్చకు వచ్చినా లెక్కలు చెప్పడానికి సిద్ధం
- అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
అచ్చంపేట/మన్ననూర్, అక్టోబరు 14 (ఆంధ్ర జ్యోతి): రాబోయే రోజుల్లో అచ్చంపేటను పర్యా టక జంక్షన్‌గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి ప లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వ ర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు మన్ననూ రు వద్ద ఉప ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలి కారు. స్థానిక నిరంజన్షావలి దర్గా, లింగమయ్య ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మన్ననూరులోని అంబేడ్కర్, గద్దర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. బస్టాండ్‌లో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫల కాలను ప్రారంభించారు. అనంతరం మన్ననూరు పురుగులగుట్ట వద్ద రూ.53.84కోట్ల వ్యయంతో నిర్మించనున్న 220/33కేవీ సబ్ స్టేషన్, అమ్రాబా ద్ నుంచి మద్దిమడుగు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు, పదర మండలం రాయలగండి లో చెన్నకేశవస్వామి ఆలయం వద్ద రూ.50లక్షల తో రాజగోపుర నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాలను ప్రారంభించారు. అనంతరం అచ్చంపేటలో బల్మూరు, వంగూరు, రామాజిపల్లి, సిద్దాపూర్లలో 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మన్ననూరులో నిర్వ హించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మా ట్లాడారు. అచ్చంపేట ప్రాంతంతో తమ కుటుంబా నికి 46 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఈ ప్రాం తంలో ఉన్న సమస్యలన్నీ తనకు తెలుసునని, ఈ ప్రాంతంలో ఎక్కువగా విద్యుత్ సమస్య గురించి తనకు చెప్పే వారని, ప్రస్తుతం ఆ శాఖ తన పరిఽధిలోనే ఉండడం వలన మారుమూల గ్రామ ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించే సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, ట్రాన్స్ఫార్మర్ మర మ్మతు కేంద్రాలు మంజూరు చేయడం, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు మంజూరీ వంటి పను లకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. కృష్ణానదిపై వంతెన ఏర్పాటు, నల్లమలలో ఎలి వేటెడ్ కారిడార్, బెల్లెట్ రైలు జంక్షన్ వంటి కొత్త ప్రాజెక్టులు రావడంతో ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నా రు. బీఆర్‌యస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో నిధుల దోపిడీ చేస్తుంటే, తాను.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా ల పర్యటనల ద్వారా ప్రజలను చైతన్యం చే శామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రా వడంతోనే అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకా లు అందని ఇల్లు లేదని, వివిధ పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ. లక్షా 64 వే ల కోట్లు పంపిణీ చేశామని, ఈ విషయంలో ఎవరు చర్చకు వచ్చినా తాను లెక్కలు చెప్ప డానికి సిద్ధమేనని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా కోటి 6 లక్షల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం సరఫ రా చేస్తున్న ప్రభుత్వం తమదని, రేషన్ కా ర్డు కలిగిన ప్రతీ కుటుంబానికి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్య ఖర్చులకు రూ. 10 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. 71.40 లక్ష ల మంది రైతులకు రైతు భరోసా పథకం అ మలు చేశామన్నారు. 43 లక్షల మంది కు టుంబాలకు చేయూత పింఛన్ డబ్బులు పం పిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొదటి విడతలో 4.50 లక్షల ఇం దిరమ్మ గృహాలు మంజూరు చేయగా, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామ న్నారు. వచ్చే నవంబరులో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకాన్ని అ మలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడు తూ.. చాలా ఏళ్లుగా అచ్చంపేట నుంచి మద్ది మడుగు వరకు 132/11కేవీ సబ్ స్టేషన్ ద్వా రా 72 కిలో మీటర్లు దూరం విద్యుత్ సరఫరా చేయడంతో లోవోల్టేజీ సమస్య తీ వ్రంగా ఉండేదని అన్నారు. ప్రస్తుతం మన్న నూరులో మంజూరైన 220/33 కేవీ సబ్ స్టే షన్ నిర్మాణం వలన అమ్రాబాద్, పదర మండలాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ స రఫరా అవుతుందని అన్నారు. అడిగిన వెంట నే సబ్‌స్టేషన్ మంజూరీ చేసినందుకు స్థానిక ప్రజల తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో నల్లమ లకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరం దించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. మ ద్దిమడుగులో సంత్ సేవాలాల్ విగ్రహ ఏ ర్పాటు, పర్యాటక హోటళ్లను ఏర్పాటు చేసేం దుకు నిధులు మంజూరు చేశామని అన్నా రు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆ దర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దే వసహాయం, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలో ని చాబ్రా, ట్రాన్స్‌కో సీఎండీలు కృష్ణ భాస్కర్, జితేష్ వీ పాటిల్, విద్యుత్తు శాఖ ఆపరేషన్ డైరెక్టర్ నరసింహ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మ న్ ఒబేదుల్లా కొత్వాల్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, గ్రామ సర్పంచ్ విస్లావత్ మంజుల మరియు తదితరులు పాల్గొన్నారు.