Share News

అర్హులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:24 PM

అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ అక్రిడిటే షన్‌ కార్డులు వస్తాయని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని టీయూడబ్ల్యూజే ఐ జేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌అలీ అన్నా రు.

 అర్హులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు
వినతి పత్రం అందజేస్తున్న పాలమూరు జర్నలిస్టులు

- జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతర పోరాటం

- టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ

- 252 జీఓను సవరించాలని పాలమూరు జర్నలిస్టుల వినతి

మహబూబ్‌నగర్‌, మార్చి 6 (ఆంధ్ర జ్యోతి): అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ అక్రిడిటే షన్‌ కార్డులు వస్తాయని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని టీయూడబ్ల్యూజే ఐ జేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌అలీ అన్నా రు. అనర్హుల చేతిలో అక్రిడిటేషన్‌ కార్డులు ఉండటానికి వీలులేదని, అదే సమయంలో అ ర్హులకు అన్యాయం జరగవద్దన్నదే తమ లక్ష్య మని చెప్పారు. శుక్రవారం పాలమూరులోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జర్న లిస్ట్‌ల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చే శామని, ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఢి ల్లీకి వెళ్లి గళం విప్పిన యూనియన్‌ తమదేన ని, అత్యధిక సభ్యత్వాలు కలిగిన ఐజేయూ అ న్ని జిల్లాలలో బలంగా ఉందన్నారు. జర్నలి స్టులతో పాటు డెస్క్‌ జ ర్నలిస్టు హక్కుల సాధన కు ముందునుంచి పోరా డుతున్నామని గుర్తు చే శారు. అక్రిడిటేషన్‌ కార్డు ల జారీ విషయంలో ఉ న్న అడ్డంకులను అధిగ మించి అర్హులందరికీ కా ర్డులు వచ్చేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తా మని స్పష్టం చేశారు. రా ష్ట్ర కార్యదర్శి మధుగౌడ్‌, మీడియా కన్వీనర్‌ హైమద్‌పాష, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కా టం నాగరాజుగౌడ్‌, సతీష్‌ రెడ్డి, చంద్రశేఖ ర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

252 జీఓను సవరించాలని వినతి

అక్రిడిటేషన్‌ కార్డుల జారీ విషయంలో వి డుదల చేసిన జీఓ 252ను సవరించాలని మహబూబ్‌నగర్‌ ప్రెస్‌క్లబ్‌, డెస్క్‌జర్నలిస్ట్‌ల ఆధ్వర్యంలో జర్నలిస్ట్‌లు విరాహత్‌అలీకి విన తి పత్రం అందజేశారు. ఇదివరకు ఉన్న జీ ఓ ప్రకారం కార్డులు జారీచేయాలని కోరారు. ప్రధాన పత్రికలలో పనిచేసే జర్నలిస్ట్‌లు, డెస్క్‌ జర్నలిస్ట్‌లకు నష్టం కలిగేలా విడుదల చేసిన ఈ జీఓను రద్దుచేసి పాతదాని ప్ర కారం జీఓ విడుదల చేయాలని కోరారు. క్షే త్ర స్థాయిలో పనిచేసే జర్నలిస్ట్‌లందరికీ కా ర్డులు వచ్చేలా కృషి చేయాలని కోరగా, అం దరికీ వస్తాయని, ఎవరూ ఆందోళన చెంద వద్దని స్పష్టం చేశారు. ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి నరేందర్‌గౌడ్‌, జర్నలిస్ట్‌లు కిశోర్‌కు మార్‌, నోముల రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వ రరావు, బస్వరాజు, విజయభాస్కర్‌, శివకు మార్‌, మధుసూదన్‌రావు, ప్రెస్‌క్లబ్‌ కోశాధి కారి యాదయ్య, ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌, అంజి, కార్యదర్శులు సతీష్‌కుమార్‌, కృష్ణ, రవికుమార్‌, డెస్క్‌ జర్నలిస్ట్‌ల సంఘం అ ధ్యక్షుడు శ్రీనివాసులు, సాయికుమార్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 11:24 PM