శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:52 PM
శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై క్రూయిజర్ ఎదురుగా వస్తున్న బైౖకును ఢీకొ ట్టి అదుపుతప్తి బోల్తాపడింది.
- బైకును ఢీకొట్టిన క్రూయిజర్
- ఇద్దరి మృతి, పలువురికి గాయాలు
బ్రహ్మగిరి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై క్రూయిజర్ ఎదురుగా వస్తున్న బైౖకును ఢీకొ ట్టి అదుపుతప్తి బోల్తాపడింది. ఈ ప్రమాదం లో ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవా రం చోటుచేసుకున్నది. ఈగలపెంట ఎస్‌ఐ జయన్న, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకా రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా జింజాక్ గ్రామానికి చెందిన 16 మంది కు టుంబ సభ్యులు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం గ్వాలియర్ నుంచి రైల్‌లో ఈనెల 19న కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చారు అక్కడి నుంచి క్రూయిజర్‌లో అదేరోజు శ్రీశైలం చేరు కొని సాయంత్రం మల్లన్న దర్శనం చేసుకు న్నారు. సోమవారం తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న క్రూయిజర్ వాహనం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఆక్టోఫస్ వ్యూపాయింట్ సమీపంలో ఎదురు గా శ్రీశైలం వైపు వెళుతున్న బైౖకును ఢీకొట్టిం ది. ఆ తర్వాత అదుపు తప్పి చెట్టును గుద్దు కొని బోల్తా పడింది. ప్రమాద ఘటన ప్రాం తాన్ని పరిశీలిస్తే క్రూయిజర్ డ్రైవర్ కృష్ణయ్య అజాగ్రత్తగా వాహనం నడపడంతో ప్రమా దం జరిగినట్లు తెలుస్తోంది. క్రూయిజర్‌లో ఉన్న అమన్‌గుప్త (25) అక్కడికక్కడే మృతి చెందగా బైకుపై ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం ప్రాంతానికి చెందిన హర్ష (25) చెయ్యి విరిగి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్రూయిజర్‌లో ప్రయాణిస్తున్న 14 మంది పెద్దవారు, ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులకు ఈగలపెంట జెన్‌కో ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.