Share News

కలకలం రేపిన ఏసీబీ తనిఖీలు

ABN , Publish Date - May 15 , 2026 | 11:34 PM

మహబూ బ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలో శుక్ర వారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

 కలకలం రేపిన ఏసీబీ తనిఖీలు
వివిధ విభాగాలలోని పనుల అంశంపై మునిసిపల్‌ కమిషనర్‌ లక్ష్మారెడ్డి, సిబ్బందితో ఆరా తీస్తున్న ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ

- ఫిర్యాదుల మేరకే జడ్చర్ల మునిసిపాలిటీలో ఆకస్మిక తనిఖీలు

- ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ

జడ్చర్ల, మే 15 (ఆంధ్రజ్యోతి): మహబూ బ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలో శుక్ర వారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మద్యాహ్నం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ నేతృత్వంలో సిబ్బందితో కలిసి తని ఖీలు నిర్వహించారు. ఈ సంఘటనతో జడ్చ ర్ల మునిసిపాలిటీ పరిధిలో కలకలం రేగింది. ఏసీబీ అధికారుల తనిఖీలలో ఎవరైనా అధి కారి పట్టుబడ్డాడా? అన్న అంశం సర్వత్రా చ ర్చ జరిగింది. పలు అంశాలపై మునిసిపల్‌ క మిషనర్‌ లక్ష్మారెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది తో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆకస్మిక తనిఖీల గురించి విలేకరులకు వివరించారు. వివిధ రకాల ఫిర్యాదుల మేరకు జడ్చర్ల ము నిసిపాలిటీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వ హించడం జరిగిందని తెలి పారు. వచ్చిన ఫిర్యాదు ల మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుం టామని తెలిపారు. జడ్చర్ల మునిసిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న జోసెఫ్‌ అనే వ్యక్తి మునిసిపల్‌ అధికారులు, మాజీ కౌన్సిలర్‌పై ఫిర్యాదు చేశాడు. జడ్చర్ల పట్టణంలోని నాలా కన్వర్షన్‌ విషయంలో అన్ని రిపోర్టులు మునిసిపల్‌ కమిషనర్‌కు అందచేశానని, ఓ మాజీ కౌన్సిలర్‌ ద్వారా రూ.50వేల నగదు ఇవ్వడం జరిగిందంటూ ఫిర్యాదు చేశాడు.

Updated Date - May 15 , 2026 | 11:34 PM