విశ్వశాంతి కోసం శివుడికి అభిషేకం
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:31 PM
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న 88వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో ఆదివారం గద్వాల ఎమ్మెల్యే పాల్గొన్నారు.
గద్వాల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న 88వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో ఆదివారం గద్వాల ఎమ్మెల్యే పాల్గొన్నారు. యజ్ఞమండపంలో ఏర్పాటు చేసిన శివుడికి అభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానందస్వామీజీని కలిసి ఆ శీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నడిగడ్డలో స్వామీజీ ప్రపంచ శాంతి, మానవాళి అభ్యున్నతి కోసం మహా య జ్ఞం తలపెట్టడం ఇక్కడి ప్రజల అదృష్టంగా భా విస్తున్నానని అన్నారు. యాగ మహత్యం వలన ఈ ప్రాంతం సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో సస్యశ్యామలమై ప్రజలు సుఖసంతోషాలతో ఉం డాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ మహా యజ్ఞంలో పాల్గొనడానికి గ్రామాల, పట్టణాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరై స్వామి కృ పకు పాత్రులు కావాలని కోరారు. ఆయన వెంట నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పచ్చర్ల శ్రీధర్ గౌడ్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.