వైభవంగా అభయుడి శకటోత్సవం
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:37 PM
అంగ రంగ వైభవంగా ఊర్కొండపేట అభయాంజ నేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివా రం శకటోత్సవంతో ప్రారంభమయ్యాయి.
ఊర్కొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అంగ రంగ వైభవంగా ఊర్కొండపేట అభయాంజ నేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివా రం శకటోత్సవంతో ప్రారంభమయ్యాయి. నా గర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊ ర్కొండపేట అభయాంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు పుష్య బహుళ అమవాస్య తి థులయందు ఘనంగా ఉత్సవాలు (జాతర) నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాలతో పాటు పరిసర గ్రామాల భక్తు లు స్వామి వారిని దర్శించుకొని వారి మొ క్కులను చెల్లించుకుంటారు. శనివారం ఉద యం ఊర్కొండపేట దివంగత చిరివెల్లి కృష్ణ మూర్తి అర్చకుల వారి గృహం నుంచి ఉత్స వమూర్తిని పల్లకీలో ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో భక్తుల సందడితో ఆలయ ప్ర వేశం చేయించారు. బ్రహ్మోత్సవాల సంద ర్భంగా స్థానిక నాయకులు ధ్వజారోహణంతో మూల స్వామికి పంచామృతభిషేకం, నూత న వస్త్ర ధారణ, వెండి ఆభరణాల అలంకర ణతో గణపతి నవగ్రహ అష్టదిక్పాలక హను మాన్ మూల మంత్ర ప్రధాన అవనం (హో మం) సహస్ర నామా ర్చన జరిపించారు. అ భయాంజనేయుడికి ప్రధాన అర్చకులు ద త్తా త్రేయశర్మ ప్రత్యేక పూజలు చేసిన అ నంతరం శకటోత్సవం ప్రారంభించారు. ఊ ర్కొండ పేట, ఊర్కొం డ, ముచ్చర్లపల్లి, రాం రెడ్డిపల్లి, జకినాలపల్లి, ఇప్పపహడ్, జిల్లెల్ల, మార్చాల, గట్టుఇప్పలపల్లి తదితర గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహ నాలు, కార్లు భారీగా చేరుకొని ఆలయం చు ట్టూ ప్రద క్షిణం చేశారు. ఆలయ పరిసరాలు ఆంజనేయ నామస్మరణతో మారుమోగా యి. కల్వకుర్తి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కృష్ణదేవ తమ సిబ్బందితో ఎప్పటిక ప్పుడు పర్యవేక్షిస్తూ ప్రశాంతమైన వాతావర ణం కల్పించారు. అదేవిధంగా వైద్య శాఖ అ ధికారు లు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలుగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యచంద్రారె డ్డి ఏర్పా ట్లు చేశారు. కార్యక్రమంలో సర్పం చులు రషీద్, రమేష్‌నా యక్, మ్యాకల మం జుల, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, నాయకులు సత్యనా రాయణ రెడ్డి అర్చకులు ప్రవీణ్‌శర్మ, మహే ష్‌శర్మ, శ్రీనివాసశర్మ తదితరులు ఉన్నారు.