Share News

అబ్దుల్‌హదీ జీవితం ఆదర్శం

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:28 PM

నగరంలో ప్రేమ, సోదరభావం, మతసామరస్యాన్ని పెంపొందిస్తూ నాలుగు దశాబ్ధాల పాటు ప్రజలతో మమేకమైన హదీ భాయ్‌ జీవితం అందరికీ ఆదర్శమని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

అబ్దుల్‌హదీ జీవితం ఆదర్శం
మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : నగరంలో ప్రేమ, సోదరభావం, మతసామరస్యాన్ని పెంపొందిస్తూ నాలుగు దశాబ్ధాల పాటు ప్రజలతో మమేకమైన హదీ భాయ్‌ జీవితం అందరికీ ఆదర్శమని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని న్యూటౌన్‌లో గల షాలీమార్‌ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన అబ్దుల్‌ హదీ సంస్మరణ సభకు హాజరై మాట్లాడారు. నగరంలో ఎక్కడైన సమస్య లేదా ఉద్రిక్తత ఏర్పడితే అందరినీ కూర్చొబెట్టి పరిష్కారం చూపేందుకు హదీ భాయ్‌ ఎప్పుడు ముందుండేవాడని కొనియాడారు. మహబూబ్‌నగర్‌ అభివృద్ధి గురించి నాతో చర్చించేవారని గుర్తుచేశారు. చార్మినార్‌ ఎమ్మెల్యే మీర్‌జుల్ఫేకర్‌ అలీ, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లాకొత్వాల్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, ఎంఐఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మక్సూద్‌బిన్‌ జాకేర్‌, జాబిర్‌బిన్‌ సయీద్‌, పట్టణ అధ్యక్షుడు సాదతుల్లా హుస్సేనీ, హైసాన్‌, జహంగీర్‌, ముంజిమిల్‌, ముస్తాక్‌రశీద్‌, ఇమ్రాన్‌షరీఫ్‌, షబ్బీర్‌అహ్మద్‌, ఉమర్‌ కొత్వాల్‌, బషీర్‌,తఖీయోద్దీన్‌, మోయిజ్‌ పాల్గొన్నారు.

ఉర్దూ లైబ్రరీ ప్రారంభం..

నగరంలోని న్యూటౌన్‌ 60వ డివిజన్‌లో తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఉర్దూ లైబ్రరీని ఎమ్మెల్యే యెన్నం ప్రారంభించి, మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఈ లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనిత, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్‌అక్తర్‌, డీసీసీ కార్యదర్శి సత్తూర్‌ చంద్రకుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:28 PM