Share News

నమ్మించి మోసం చేసిన యువకుడు

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:39 PM

ఐదేళ్లు ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించి చివరకు వేరే యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవా రం రాత్రి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

నమ్మించి మోసం చేసిన యువకుడు

- యువతి ఆత్మహత్యాయత్నం

గద్వాల క్రైం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లు ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించి చివరకు వేరే యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవా రం రాత్రి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గద్వాల సీఐ టీ.శ్రీను తె లిపిన వివరాల ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి వేరే కులానికి చెందిన యువకుడు పరిచయమయ్యాడు. ఐదేళ్లుగా వీరు ప్రేమించి కుంటున్నారు. చివరకు ఇక తనకు ఆ యువకుడితో పెళ్లి అవుతుందనుకున్న తరుణంలో కులాలు వేరు కావడంతో ఆ యువకుడు రెండు రోజుల క్రితం వేరే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు రెండు రోజుల నుంచి ఆ యువకుడికి ఫో న్‌ చేసేందుకు ప్రయత్నించిన స్విచ్ఛాప్‌ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ధరూర్‌ మండలంలోని జూరాల డ్యాంలో దూకేందుకు యత్నించింది. గమనించిన కొందరు వెంటనే పోలీసులకు సమాచా రం అందించారు. వెంటనే సీఐ అవతలి వ్యక్తులను ఆ యువతి వద్ద కు పంపించి వారి ఫోన్‌లోనే మాట్లాడుతూ నీకు న్యాయం చేస్తానని చెపుతూనే మరో వైపు పోలీసులను అక్కడికి పంపించారు. చివరకు పోలీసులు ఆమెను సీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. యువతికి నచ్చచెప్పి న్యాయం జరిగేలా చూస్తానని, శనివారం ఆ యువకుడితో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడతానికి నీవు ఆత్మహత్య చేసుకోరాదని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. యువతిని తల్లిదండ్రులకు అప్పజెప్పి వారి ఊరికి పంపించారు.

Updated Date - Jan 09 , 2026 | 11:39 PM