జలాల వినియోగంపై శ్వేత పత్రం ప్రకటించాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:47 PM
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, సా గునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు ద మ్ముంటే మూడేళ్లల్లో కృష్ణ, గోదావరి జలాలు ఎంత వినియోగమయ్యాయో శ్వేతపత్రం ప్రక టించాలని బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనాయకుడు త న్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
- బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనాయకుడు తన్నీరు హరీశ్‌రావు డిమాండ్
- గురుదక్షిణ కింద తెలంగాణ వాటాను ఆంధ్రాకు ధారాదత్తం
నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యో తి): ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, సా గునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు ద మ్ముంటే మూడేళ్లల్లో కృష్ణ, గోదావరి జలాలు ఎంత వినియోగమయ్యాయో శ్వేతపత్రం ప్రక టించాలని బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనాయకుడు త న్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గురుదక్షి ణ కింద కృష్ణ, గోదావ రి జలాలను ఆంధ్ర ప్రాం తానికి ధారాదత్తం చేయడం తప్పా రైతాంగాని కి ప్రయోజనం చేకూరిన అంశం ఒక్కటి కూడా లేదని దుయ్యబట్టారు. బుధవారం నాగర్‌కర్నూ ల్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావే శంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం పేరు చెప్పి కాంగ్రెస్ నేతలంతా ప్రకృతిని నింది స్తున్నారని, పాలమూరు జిల్లాలో ప్రతీ ప్రాజెక్టు ను సందర్శిస్తే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కన్పి స్తున్నాయన్నారు. కృష్ణానది జలాల వినియోగం లో ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 36 టీఎంసీల నీటిని తెలంగాణ సాగు భూములకు మళ్లించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంకెల గారడీతో రైతాంగాన్ని మోసగించే ప్రయత్నం చే యడం ఏమాత్రం సహించరని విషయమన్నా రు. కేసీఆర్ చాలా దూరదృష్టితో కృష్ణ, గోదావరి జలాలపై లిఫ్టులు, రిజర్వాయర్లు నిర్మించారని, బీఆర్‌ఎస్ పాలన, కాంగ్రెస్ అధికారంలో ఎన్ని ఎకరాల సాగు భూములకు నీరందించారో వివ రాలతో శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన డి మాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొం త జిల్లాలో ఎకరా పంట ఎండినా సహించబో మని ఇందుకోసం ఉద్య మిస్తామని స్పష్టం చే శారు. రాబోయే కాలంలో కృష్ణా, గోదావరి నదీ జలాలను మళ్లించే ప్రయత్నం చేస్తే మహోద్య మం తప్పదని హెచ్చరించారు. కేఎల్‌ఐ కింద ఆ యకట్టులో సింహభాగానికి, పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం కింద నార్లాపూర్, ఏదు ల, వట్టెం రిజర్వాయర్ల వరకు కృష్ణా జలాలను పంపింగ్ చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఈ అంశంపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ నేతలు సిద్ధం కావాలని, వేదిక వాళ్లే నిర్ణయించాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.