Share News

విగ్రహ చోరీపై లోతుగా దర్యాప్తు చేయాలి

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:45 PM

మండలంలోని కుడికిళ్లలో పురాతన చంద్రమౌ లీశ్వర స్వామి (శివాలయం) ఆలయంలో నం దీశ్వర విగ్రహం అపహరణకు గురి కావడంపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తీవ్ర వి చారం వ్యక్తం చేశారు.

విగ్రహ చోరీపై లోతుగా దర్యాప్తు చేయాలి
శివాలయంలో చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి

కొల్లాపూర్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కుడికిళ్లలో పురాతన చంద్రమౌ లీశ్వర స్వామి (శివాలయం) ఆలయంలో నం దీశ్వర విగ్రహం అపహరణకు గురి కావడంపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తీవ్ర వి చారం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన గ్రామాన్ని సందర్శించి ఆలయాన్ని పరిశీ లించారు. అనంతరం విలేకరుల సమావే శంలో మాట్లాడారు. విగ్రహాన్ని గుర్తు తె లియని వ్యక్తులు పెకిలించుకునిపోవడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీ సిందన్నారు. ఘటన జరిగి 15 రోజులు గ డుస్తున్నా పోలీసు యంత్రాంగం నిందితు లను గుర్తించకపోవడం చాలా బాధాక రమని అన్నారు. ఎస్పీ, కలెక్టర్‌ ఈ ఘట నపై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎస్పీ, డీజీపీలను కలిసి విగ్రహ చోరీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరనున్నట్లు వెల్ల డించారు. శివయ్య శెట్టి షగాది కృష్ణ, భాస్కర్‌ రావు, బంగారయ్య, కుబేరుడు శ్రీనివాసులు, శివ, మహేశ్‌, సత్యం శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 11:45 PM