ఒక్క మాత్ర ఆరోగ్యానికి భరోసా
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:58 PM
అల్బెండజోల్ మాత్ర పిల్లల ఆరోగ్యానికి భరోసా నిస్తుందని అదనపు కలెక్టర్ అరుణారెడ్డి అన్నారు.
కందనూలు, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : అల్బెండజోల్ మాత్ర పిల్లల ఆరోగ్యానికి భరోసా నిస్తుందని అదనపు కలెక్టర్ అరుణారెడ్డి అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జడ్పీహెచ్ ఎస్‌లో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ అరుణారెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు అల్బెండజోల్ మాత్ర లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాదులని ఆమె అన్నారు. 1-19సంవత్సరాల వయస్సు గల పిల్లందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయడం ద్వారా నులిపురుగుల వల్ల కలిగే నష్టాలను అరికట్టవచ్చని అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అఽధికారి డాక్టర్ కే.కృష్ణ , ప్రొగ్రామ్ అధి కారి సురేష్‌బాబు, డిప్యూటీ భరత్‌కుమార్‌రెడ్డి, పాఠశాల జీహెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి, వైద్య అధికారులు, ఏఎన్‌ఎమ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.