Share News

ఊట్కూర్‌ జనసంద్రం

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:09 PM

నారాయణపేట జిల్లా ఊట్కూరులో మొహర్రం ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున 5 గంటలకు ప్రారంభమైన పగలు సవారీ గ్రామ వీధుల గుండా కొనసాగుతూ 10 గంటల వరకు కొనసాగింది.

ఊట్కూర్‌ జనసంద్రం
పగలు సవారీ సందర్భంగా చిన్నారిని ఊయలలో వేసే ఘట్టాన్ని తిలకిస్తున్న భక్తులు

ముగిసిన మొహరం ఉత్సవాలు

ఊట్కూరు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా ఊట్కూరులో మొహర్రం ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున 5 గంటలకు ప్రారంభమైన పగలు సవారీ గ్రామ వీధుల గుండా కొనసాగుతూ 10 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన రాత్రి సవారీ రాత్రి 10 గంటల ప్రాంతంలో చెరువు కట్ట అలుగు వద్దకు చేరడంతో ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల కోసం వలస పోయిన వారు, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పీర్ల మసీదు ప్రాంతం గురువారం రా త్రి నుంచే భక్తులతో కిటకిటలాడింది. సవారీలకు భ క్తులు తరలొచ్చి, మొక్కులు చెల్లించుకున్నారు. పొ ట్టేళ్లు కోశారు. కొందరు భక్తులు వెండి ఊయలలు, ద ట్టీలను సమర్పించారు. డప్పు దరువులు, బ్యాండ్‌మేళాలతో ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. తమ్ముడు హుస్సేన్‌ వెంట అన్న హసన్‌ పీరు వెళ్తుంటే దారి పొడవుగా భక్తులు కాళ్లకు నీళ్ళుపోస్తూ, దీవెనలు పొందారు. అనంతరం నారాయణ పాఠశాల సమీపంలో పీర్లలను పట్టేవారి వంశంలో పుట్టిన మగబిడ్డను ఏటా మాదిరిగా ఊయలలో వేసే ఘట్టం ఆకర్షణగా నిలిచింది. రాత్రి సవారి ఊరేగింపు అనంతరం పెద్ద చెరువు అలుగు కట్టపై విషాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు ముగిశాయి. ప్రాణత్యాగం చేసిన హసన్‌-హుస్సేన్‌లతో పాటు మృతి చెందిన తమ కుటుంబ సభ్యులను తలుచుకుని మహిళా భక్తులు బోరున విలపించారు. రోషన్‌ అలీ దర్గాను భక్తులు దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెంతో పాటు కాంగ్రెస్‌ మండల నాయకులు పీర్లలకు పూల చాద ర్లు, దట్టీలను సమర్పించారు. పులిమామిడి, పెద్దజట్రం, నిడుగుర్తి గ్రామాల్లోనూ పీర్ల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నారాయణపేట డీఎస్పీ లింగయ్య, మఖ్తల్‌ సీఐ రాంలాల్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఊట్కూర్‌ ఎస్‌ఐ రమేశ్‌, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 11:09 PM