Share News

సమాజంలో సురక్షిత వాతావరణం

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:57 PM

సమాజంలో సురక్షిత వాతావ రణం నెలకొనాలంటే ప్రతీ ఉద్యోగి అప్రమ త్తంగా ఉండాలని కార్యాలయాల్లో లింగ సమా నత్వం, మహిళల గౌరవం సంస్థ బాధ్యతగా భా వించాలని డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ నాయక్‌ అన్నారు.

సమాజంలో సురక్షిత వాతావరణం
సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్న డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ నాయక్‌

- డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ నాయక్‌

వనపర్తి విద్యా విభాగం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో సురక్షిత వాతావ రణం నెలకొనాలంటే ప్రతీ ఉద్యోగి అప్రమ త్తంగా ఉండాలని కార్యాలయాల్లో లింగ సమా నత్వం, మహిళల గౌరవం సంస్థ బాధ్యతగా భా వించాలని డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ నాయక్‌ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల భద్రత, రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షే మ వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో నిర్వ హించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత కా లంలో తెలియని లింకులు, కాల్స్‌, మెసెజ్‌పై జా గ్రత్తగా ఉండాలన్నారు. సురక్షితమైన పని వా తావరణం ఏర్పడితేనే సంస్థలు అభివృద్ధి సాధి స్తాయని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మల్లికార్జున్‌, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ అంజద్‌, సైబర్‌ క్రైమ్‌ ఎస్‌ఐ రవి ప్రకాష్‌, శిరీష, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 11:57 PM