Share News

అమెరికాలో వనపర్తి జిల్లా వాసి మృతి

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:35 PM

అమెరికాలోని ఫ్లోరిడాలో మంగళవారం తెలంగాణ వాసి హర్షవర్ధన్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందా డు.

అమెరికాలో వనపర్తి జిల్లా వాసి మృతి
హర్షవర్ధన్‌రెడ్డి (ఫైల్‌)

- మృతుడి స్వగ్రామం బొల్లారంలో విషాదఛాయలు

వీపనగండ్ల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : అమెరికాలోని ఫ్లోరిడాలో మంగళవారం తెలంగాణ వాసి హర్షవర్ధన్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందా డు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామా నికి చెందిన సర్పంచు సుదర్శన్‌రెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి పది సంవత్సరాలుగా అమెరికాలో పాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ భార్యా పిల్లలతో స్థిరపడ్డారు. ఇంట్లో వర్క్‌ఫ్రం హోం చేస్తుండగా ఉదయం గుండెపో టుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విష యం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. హర్షవర్ధన్‌రెడ్డి అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని తీసుకువచ్చే అవ కాశం లేక పోవడంతో మృతుడి తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరారు. అక్కడే అంత్య క్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 28 , 2026 | 11:35 PM