అవినీతికి అందలం వారి వైఖరితో కందనూలుకు అవినీతి మరక
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:40 PM
కొందరు అధికారుల అవినీతి చేష్టల వల్ల జిల్లా ప్రతిష్ట మసక బారుతోంది. విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సౌలభ్యం కల్పించే మాట దేవుడె రుగు కానీ సొంత ఆస్తులను పెంపొందించుకు నేందుకు వీరు పడుతున్న తపన, తాపత్రయం విస్మయానికి గురి చేస్తోంది. ఇందులో కొందరు మహిళా ఉద్యోగుల పాత్ర కూడా ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది.
- ఇరిగేషన్ అధికారులకు దడ పుట్టిస్తున్న ఏసీబీ దాడులు
- డీఈ అక్రమ ఆస్తులపై రెండవ రోజూ కొనసాగిన విచారణ
- కీలక పత్రాలు లభ్యం
- జిల్లాలో భూ అక్రమాలకు వత్తాసు పలుకుతున్న కొందరు రెవెన్యూ సిబ్బంది
- మహిళా ఉద్యోగుల పాత్రపై ఆందోళన
నాగర్‌కర్నూల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొందరు అధికారుల అవినీతి చేష్టల వల్ల జిల్లా ప్రతిష్ట మసక బారుతోంది. విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సౌలభ్యం కల్పించే మాట దేవుడె రుగు కానీ సొంత ఆస్తులను పెంపొందించుకు నేందుకు వీరు పడుతున్న తపన, తాపత్రయం విస్మయానికి గురి చేస్తోంది. ఇందులో కొందరు మహిళా ఉద్యోగుల పాత్ర కూడా ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో అతి పెద్ద జిల్లా అయిన నాగర్‌కర్నూల్‌లో కొల్లాపూర్, నాగర్‌క ర్నూల్ కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలు ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో ఉమ్మడి మహ బూబ్‌నగర్‌లో మిగతా ప్రాంతాల కంటే నాగర్‌క ర్నూల్ జిల్లాలోనే అత్యధికంగా లంచాలు తీసు కుంటూ ఏసీబీకి చిక్కడం వివాదాస్పదంగా మా రుతున్నది. తాజాగా ఇరిగేషన్ డీఈ సత్య నారాయణకు సంబంధించి గురువారం పలుచో ట్ల జరిగిన ఏకకాల దాడుల్లో మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.70కోట్ల అక్రమ ఆస్తులు పట్టుపడటంతో పాటు జిల్లా మరోసారి రాష్ట్రం లో తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో లంచావతారులు పడగ విప్ప డం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇసుక వ్యాపారాల నుంచి భూముల రిజిస్ట్రేషన్ల వరకు..
జిల్లాలో దుందుభీ వాగు కొందరు పోలీసులు, రెవెన్యూ అధికారులకు వరంగా మారింది. దుం దుభీ పరివాహక ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం లక్షల్లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి రాజకీయ నాయకుల సిఫారసుతో వసూళ్ల దందాకు తెర లేపుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వా రా సాగునీరు అందుతుండటంతో భూముల ధ రలకు కూడా రెక్కలు రావడంతో అక్రమ రిజిస్ట్రే షన్లకు రెవెన్యూ అధికారులు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో అయ్యవారిపల్లిలో దాదాపు 13న్న ర ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జ రిగిన అక్రమాలపై విచారణ జరిపి మహిళా తహసీల్దార్‌ను నాగర్‌క ర్నూల్ కలెక్టర్ సస్పెండ్ చేయడం తెలిసిందే. ఓ కేసు వ్యవహారంలో 30వేలు లంచం తీసుకుంటూ తి మ్మాజిపేట ఎస్‌ఐగా పని చేసిన హరిప్రసాద్‌రెడ్డి ఏసీబీకి చిక్కగా, వె ల్దండ ఎస్‌ఐగా పని చేసిన ఎం.రవి 2024 జూన్ 26న పేలుడు పదార్థా లకు సంబంధించి ఒక కేసులో 50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వ లలో చిక్కాడు. ఇదే మండలంలో వి ద్యుత్ కనెక్షన్ కోసం 20వేలు లంచం తీసుకుం టూ గతేడాది డిసెంబరు 9న ఏఈ వెంకటేశ్వర్లు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. లంచాల మకి లీ విద్యాశాఖకు కూడా అంటుకుంది. తాడూరు మండల కేంద్రంలో తాడూరు ఎంఈవో రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా కొ ల్లాపూర్‌లో మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల కోసం మండల విద్యాశాఖ అధికారి రూ. లక్ష డిమాండ్ చేసి ఆ డబ్బును తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. చారకొండలో వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెం ట్ ఇవ్వడానికి తహసీల్దార్ నాగమణి రూ.75 వేలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించి రూ.70వేలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించా డు. స్టేషన్ బెయిళ్ల విషయంలో కూడా అక్రమా లు జరుగుతున్నాయి. కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో రెండవ ఎస్‌ఐ రామచందర్ గుండూరుకు చెందిన వెంకటయ్య నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ గత ఏడాది జూన్ 25న ఏసీబీకి చిక్కాడు.
ఏసీబీ దాడులతో అధికారుల్లో ఆందోళన
జిల్లాలో పకడ్బందీగా జరుగుతున్న ఏసీబీ దాడులు అవినీతి అధికారుల్లో దడపుట్టిస్తున్నాయి. ప్రణాళిక ప్రకా రం ఏసీబీ నిఘా పెట్టింది. ఇరిగేషన్, పంచాయతీరాజ్, మునిసిపల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దృష్టి పెట్టింది. ఏసీబీకి టోల్ ప్రీ నెంబరు ద్వారా ఎలాంటి సమాచారం వచ్చినా ఆ శాఖ అధికారులు ఆషామాషీగా తీసుకోవడం లేదు. నిఘా ద్వారా అవినీతి అధికారుల చిట్టాను సమీకరి స్తూ వారిని తమ వలలో వేసుకోవడానికి చాకచక్యంగా వ్యవహరిస్తూ కేసులు చేస్తుండటం విశేషం. ముఖ్యమంత్రి సొంత జిల్లాపై వీరి దృష్టి ప్రధానంగా ఉంది.