కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలి
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:08 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు.
పాలమూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సీఐటీ యూ జిల్లా 14వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ కార్మికు డికి పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనసు, గ్రాటివిటీ, పెన్షన్ సౌకర్యాలు అమలు చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. డిసెంబరు 1,2,3వ తేదీల్లో ఢిల్లీ ఆక్యుపై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి కూరపాటి రమే ష్, ఎస్‌ఎస్‌ఆర్‌ఏ ప్రసాద్ హాజరై మాట్లాడారు. అనంతరం జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా వేణుగోపాల్, నల్లవెల్లి కురుమూర్తి, కోశాధికారిగా వి.కురుమూర్తి, ఉపాధ్యక్షులుగా వీరాంజనే యులు, గాలెన్న, సావిత్రి, చంద్రకాంత్, సహాయ కార్యదర్శులుగా సరోజ, వసియాబేగంతో పాటు 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్, ఖమర్‌అలీ, దీప్లానాయక్, రాజకుమార్, గోనెల రాములు, నాగరాజు, యం.వెంకటేష్‌గౌడ్ తదిత రులు పాల్గొన్నారు.