Share News

మేన బావ.. జీవితానికి తోవ...

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:25 PM

వనపర్తి జిల్లా మదనాపురం మం డలం కర్వెన తండాకు చెందిన దేవమ్మకు చిన్నతనంలోనే పోలియో సోకింది. రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవలేని స్థితిలో ఇంటికే పరిమితిమైంది.

మేన బావ.. జీవితానికి తోవ...
భార్యను మోస్తూ భిక్షాటన చేస్తున్న భర్త నర్సింహ్మ

- భుజాలపై భార్యను మోస్తూ భిక్షాటన

రామాయణంలో శ్రవణ కుమారుడి కథ విం టాం... తన గుడ్డి తల్లిదండ్రుల ను కావడిలో కూర్చోబెట్టుకొని పుణ్యక్షేత్రాలకు తిప్పిన పౌరాణిక పాత్ర ఆయనది... కానీ, ఇక్కడ తన మేనకోడలికి అంగవైకల్యం ఉన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... వీపున ఎత్తుకొని భిక్షాటన చేస్తూ ప్రేమకు పరమార్థాన్ని చాటుతున్న నర్సింహ్మనాయక్‌ జీవిత కథ ఇది...

మదనాపురం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా మదనాపురం మం డలం కర్వెన తండాకు చెందిన దేవమ్మకు చిన్నతనంలోనే పోలియో సోకింది. రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవలేని స్థితిలో ఇంటికే పరిమితిమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా వీరన్నపేటకు చెందిన ఆమె మేనత్త కుమారుడు నర్సిం హ్మనాయక్‌ అంగవైకల్యాన్ని లెక్కచెయ్యకుండా దేవమ్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. భార్య ఎక్కడికైనా వెళ్లాలంటే తన భు జాలపై మోస్తూ, అవకాశం ఉంటే ట్రై సైకిల్‌పై కూర్చోబెట్టుకొని తీసుకెళుతుంటా డు. కుటుంబ పోషణ కోసం ఇద్దరూ కలిసి బిక్షాటన చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బం దులతో అనేక కష్టాలు ఎదురవుతున్నా భార్యకు తోడుగా నిలుస్తున్న నర్సింహ్మ నాయక్‌ తీరు పలువురి మనసును కదిలిస్తున్నది. పెళ్లినాడు చేసిన ప్రమాణాల ను ఆచరణలో చూపిస్తూ మానవీయ బంధాలకు అద్దం పడుతున్నాడు.

ఫబావ వల్లే బతికున్నా : దేవమ్మ

నా రెండు కాళ్లు కదలలేకున్నా బావ అన్నీ పనులు చేస్తూ బతికిస్తున్నడు. మా పరిస్థితిని జిల్లా అధికారులకు తెలియజేసినం. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. మా జీవనోపాధికి ప్రభుత్వం చేయూతనిస్తే బాగుంటుంది.

Updated Date - Nov 06 , 2026 | 11:26 PM