Share News

వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:33 PM

మండలంలోని చింతల్‌తండాలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వర స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
కోయిలకొండలో పల్లకీ సేవ నిర్వహిస్తున్న భక్తులు

కోయిలకొండ, పిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చింతల్‌తండాలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వర స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుదర్శన హోమం, జల్దీ, పల్లకీ సేవ నిర్వహించి, అన్నదానం చేశారు. సర్పంచ్‌ రుక్కమ్మ, ఉప సర్పంచ్‌ నర్సింగ్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాంచందర్‌నాయక్‌, నాయకులు వెంకట్‌నాయక్‌, కిషన్‌నాయక్‌, శంకర్‌నాయక్‌, రామ్‌లాల్‌, రామునాయక్‌, శంకర్‌ పాల్గొన్నారు.

గండీడ్‌ : మండలంలోని వెన్నచేడ్‌ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. సర్పంచ్‌ గుర్రాల నవనీత, ఉప సర్పంచ్‌ రవికాంత్‌రెడ్డి, రాంరెడ్డి, పులిందర్రెడ్డి, పుల్లారెడ్డి, అనంత లక్ష్మారెడ్డి, శివమల్లప్ప పాల్గొన్నారు.

మహమ్మదాబాద్‌ : మండలంలోని నంచర్ల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామి వారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం పల్లకీ సేవ, శకటోత్సం నిర్వహించారు.

లక్ష్మీనారాయణ స్వామి కల్యాణం

రాజాపూర్‌ : మండలంలోని రంగారెడ్డిగూడ లక్ష్మీ నారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణం ఆలయ ధర్మకర్త దిలీప్‌రెడ్డి, శశికళరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. అంతకుముందు లక్ష్మీనారాయణస్వామి, అమ్మవారి విగ్రహాలను ఊరేగించారు. ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌గౌడ్‌, చైర్మన్‌ దుశ్యంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ శశికళరెడ్డి, సుజయ్‌ చంద్రరెడ్డి, రమణ, రమేష్‌, రాములు, లక్ష్మినారాయణ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 11:33 PM