Share News

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:21 PM

నగరంలోని గడియారం చౌరస్తాలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

 ఎన్టీఆర్‌కు ఘన నివాళి
ఎన్టీఆర్‌ చిత్ర పటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

మహబూబ్‌నగర్‌ టౌన్‌/హన్వాడ/నవాబ్‌పేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని గడియారం చౌరస్తాలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఆర్‌.బాలప్ప, నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి, ఆయన చేసిన సేవలను కొనియాడారు. పట్వారి వ్యవస్థను రద్దు చేయడంతో పాటు రూ.2కే కిలో బియ్యం పథకాన్ని అమలు చేశారని వివరించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఎర్రమన్ను గుట్ట పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అన్నదానం చేశారు. మాలాద్రిరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చెన్నప్ప, వనగంటి శంకర్‌ పాల్గొన్నారు.

హన్వాడ మండల కేంద్రంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఎండీ ఖాసీం, మాజీ ఎంపీపీ బాలరాజు, శ్రీనువాసులు, నాగన్న, అనంతరెడ్డి, పెంటయ్య, ఆంజనేయులు, రాములు, తిమ్మయ్య, చంద్రయ్య, సిరాజ్‌ పాల్గొన్నారు.

నవాబ్‌పేట మండల కేంద్రంలో టీడీపీ మండల కార్యదర్శి బాలస్వామి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్ర పటానికి నివాళి అర్పించారు. టీడీడీ నాయకుడు అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 11:21 PM