Share News

వర్షం కోసం మహాయజ్ఞం

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:19 PM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురువక రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.

వర్షం కోసం మహాయజ్ఞం
అనంతాపురం శివాలయం వద్ద నృత్యం చేస్తున్న చిన్నారులు

- అనంతాపురంలో హాజరైన బండ్ల జ్యోతి

గద్వాల/మానవపాడు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురువక రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. వరుణదేవా కరుణించవా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతాపురం గ్రామంలో ఆదివారం గ్రామస్థులు, రైతులు శివాలయంలో యజ్ఞం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు ఫలించి వరుణదేవుడు వర్షాలు కురిపించాలని పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని ఆమె కోరుకున్నారు. ఈ సందర్భంగా వరుణదేవుడిని ప్రార్థిస్తూ చిన్నారులు శివుడి పాటలకు నృత్యాలు చేశారు. కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ జయరామిరెడ్డి, జములమ్మ ఆలయ మాజీ డైరెక్టర్‌ రాధారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 11:19 PM