Share News

నేడు ఉద్దాలోత్సవం

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:19 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.

నేడు ఉద్దాలోత్సవం
కురుమూర్తి ఆలయ ప్రధాన రాజగోపురం

- పల్లమర్రి నుంచి చాట, చిన్న వడ్డెమాన్‌ నుంచి కొనసాగనున్న ఉద్దాల ఊరేగింపు

-భక్తజనసంద్రంగా మారిన కురుమూర్తి జాతర మైదానం

- సీసీ కెమెరాలతో నిఘా

చిన్నచింతకుంట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన ఉద్దాలోత్సవ కార్యక్రమం సో మవారం జరుగనుంది. తెలంగాణ ప్రాంతంలోనే తిరుమల ప్రతిరూపంగా వెలుగొందుతున్న కురుమూర్తి వేంకటేశ్వరస్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి జిల్లా మహబూబ్‌నగర్‌ వ్యాప్తంగా కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ర్టాలకు చెందిన భక్తులు, ఇతర దేశాలకు చెందిన వారు కూడా స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు.

చాట ఊరేగింపు..

ఉద్దాలోత్సవం నేపథ్యంలో సంప్రదాయం ప్రకా రం పల్లమర్రి గ్రామం నుం చి ఉద్దాలను ఉంచే చాటను ఊరేగింపుగా చిన్న వడ్డెమాన్‌కు తీసుకువస్తారు. చిన్న వడ్డెమాన్‌ గ్రామంలోని ఉద్దా ల తయారీ గదినుంచి ఊరేగింపు కురుమూర్తి క్షేత్రానికి చేరుకుంటుంది.

దేవాదాయ శాఖ, ఆలయ పాలకవర్గం ఏర్పాట్లు..

దేవరకద్ర ఎమ్మెల్యే జి.మదుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అటు దేవాదాయ శాఖ, ఇటు కురుమూర్తి ఆలయ పాలక వర్గం వారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి గానూ గత కొన్ని రోజుల క్రితం జిల్లా కేంద్రంలోనూ, దేవాలయ జాతర మైదానంలోనూ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీటి వసతి, బాత్‌రూంలు, టాయిలెట్స్‌ల ఏర్పాటు, వైద్య సదుపాయం, ప్రత్యేక అంబులెన్స్‌, అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఫైరింజన్‌ అందుబాటులో ఉంచారు. ఆయా గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ సిబ్బందితో జాతర మైదానంలో పారిశుధ్యలోపం తలెత్తకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఏర్పాటు, జాతరలోని దుకాణాదారులు ప్రత్యేకించి చెత్త కుండీలను ఏర్పాటు చేసుకోవాలని సూ చించారు. కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీ సుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉద్దాలోత్సవం రోజున బారికేడ్ల ఏర్పాటు, కోనేరు, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. జాతరలో జూదం, మట్కా, హింసాత్మక ఘటనలు జరుగకుం డా చర్యలు, మాదకద్రవ్యాలు వంటివి జాతర ఉండకూడదని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

622 మందితో పోలీసు బందోబస్తు

కురుమూర్తిస్వామి ఉద్దాలోత్పవానికి జిల్లా ఎస్పీ జానకి ఆదేశానుసారం పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి శనివారం డీఎ్‌సపీ వేంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణల నేతృత్వంలో దాదాపు 622 మంది సి బ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు, జాతరకు డీఎ్‌సపీ లు-3, సీఐలు 30మంది, ఎస్‌ఐలు 59మంది, ఏఎ్‌సఐలు 178, కానిస్టేబుల్స్‌ 226, మహిళా కానిస్టేబుల్స్‌ 72, హోంగార్డులు 123 మంది కలిపి మొత్తం 622 మందితో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రత్యేక బృందాలు

జాతరలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీనికి గానూ జాతరలో ఔట్‌పో్‌స్ట ను ఏర్పాటు చేశారు. ఎక్సైజ్‌ సీఐ వెంకటేష్‌, ఎ ప్‌ఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో 7 మొబైల్‌ టీం లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించనుంది. వనపర్తి, ఆత్మకూర్‌, గూడూరు, దేవరకద్ర, చిన్నచింతకుంట తదితర ప్రాంతాల్లో ప్రత్యేక మొబై ల్‌ టీంలు తిరుగనున్నాయి.

ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల ఏర్పాటు

జాతరకు కురుమూర్తి జాతర స్పెషల్‌ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూలు, కల్వకు ర్తి, కొల్లాపూర్‌ డిపోల నుంచి ఆర్టీసీ స్పెషల్‌ బ స్సులు నడపనుంది. దీనికి గానూ జాతర మైదానంలో ప్రత్యేక బస్‌స్టా్‌పలను ఏర్పాటు చేశారు.

Updated Date - Nov 15 , 2026 | 11:19 PM