సర్కారు బడిలో బంగారు భవిష్యత్తు
ABN , Publish Date - May 14 , 2026 | 11:15 PM
సర్కారు బడిలోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుతారని జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో విజయలక్ష్మి పేర్కొన్నారు.
బడిబాట కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల డీఈవో విజయలక్ష్మి
గద్వాల సర్కిల్, మే 14 (ఆంధ్రజ్యోతి): సర్కారు బడిలోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుతారని జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో విజయలక్ష్మి పేర్కొన్నారు. విద్యా వారోత్సవాలలో భాగంగా గురువారం గ ద్వాల మండలం అనంతపురం జడ్పీహెచ్‌ఎస్‌లో బడిబాట కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులు విద్యా నినాదా లు తీశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు. పలు సంక్షేమ పథకాలు ఉచిత పుస్తకాలు, నాణ్యమైన బోధన, భోజనం, ఏకరూప దుస్తులు అందిస్తారని తెలిపారు. విద్యార్థుల చేరికల సంఖ్య పెంచేందుకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో గద్వాల ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్, జిల్లా విద్యాశాఖ సమన్వయ అధికారి కర్రెప్ప, కేజేబీవీ జిల్లా కోఆర్డినేటర్ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.