సువర్ణాధ్యాయం దీక్షా దివస్
ABN , Publish Date - Nov 29 , 2026 | 11:08 PM
: ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ ఓ సువర్ణాధ్యాయమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
దేవరకద్ర, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్ ఓ సువర్ణాధ్యాయమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో నాడు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షా వల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని గుర్తు చేశారు. ఉద్యమ స్ఫూర్తిని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్‌కు 8 మండలల నుంచి కార్యకర్తలు, ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేవరకద్ర, చిన్నచింతకుంట నుంచి పాదయాత్ర దీక్షా దివస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచిందన్నారు. నియోజకవర్గంలో 36 చెక్ డ్యాంలు నిర్మించి, వేలాది ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కర్వెన రిజర్వాయర్ నిర్మించడం జరిగిందన్నారు. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరుకి రివర్స్ మైగ్రేషన్ వచ్చేలా అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అభివృద్ధి కూడా నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. నాయకులు నారాయణగౌడ్, మహిముద్, అజయ్‌కుమార్, జగన్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సత్యంసాగర్, కొండారెడ్డి ఉన్నారు.