Share News

అన్న దుకాణానికి నిప్పంటించిన చెల్లి

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:22 PM

చెల్లిల మధ్యన ఆస్తి వివాదం చిలికి, చిలికి గాలివాన లా మారి.. అన్న దుకాణానికే చెల్లెలు పెట్రోలు పోసి మ రీ నిప్పంటించిన ఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసు కుంది.

 అన్న దుకాణానికి నిప్పంటించిన చెల్లి
తగులబడిపోతున్న షాపు

- సీసీ పుటేజీల ద్వారా గుర్తింపు, కేసు నమోదు

చిన్నచింతకుంట, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): అన్నా, చెల్లిల మధ్యన ఆస్తి వివాదం చిలికి, చిలికి గాలివానలా మారి.. అన్న దుకాణానికే చెల్లెలు పెట్రోలు పోసి మ రీ నిప్పంటించిన ఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. చిన్నచింతకుంట ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అర్థరాత్రి సమయంలో మండల కేంద్రంలోని బస్టాండు కూడలిలోని బోగం శేఖర్‌ జనరల్‌ స్టోర్‌షాపు మంటలతో తగులబడుతుందని సమా చారం రావటంతో ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది కలిసి పైర్‌ఇంజన్‌ అధికారు లకు సమాచారం ఇచ్చారు. పైర్‌ఇంజన్‌ సాయంతో మంటలను ఆర్పివే శారు. అయితే మంగళవారం షాపు యజమాని బోగం శేఖర్‌ భార్య క విత స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి షాపు దగ్ధం అయిన ఘటనపై అను మానాలు ఉన్నాయని, నా భర్త చెల్లిలు కృష్ణమ్మ ఆస్థి తగాదాలను మ నసులో పెట్టుకుని, షాపును తగులబెట్టి ఉండవచ్చని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కృ ష్ణమ్మ మధ్యరాత్రి సమయంలో షాపునకు పెట్రోల్‌పోసి, నిప్పంటించిన దృశ్యాలను సమీపంలోని సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. నిందితు రాలిని అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు, షాపులో దా దాపు రూ. 50వేల వరకు వస్తువులు బూడిదైనట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Feb 17 , 2026 | 11:22 PM