తండ్రి, కుమారుడి మధ్య తోపులాట
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:27 PM
తండ్రి, కుమారుడు తోపులాడగా తండ్రి కిందపడి మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంఽధించి సీఐ శ్రీను తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- కింద పడి తండ్రి మృతి
- భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు
గద్వాల క్రైం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): తండ్రి, కుమారుడు తోపులాడగా తండ్రి కిందపడి మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంఽధించి సీఐ శ్రీను తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని బుర్ధపేట కాలనీలో చంద్రయ్య(70) నివాసం ఉండేవాడు. అయితే చంద్రయ్య కుమారుడు లోకేష్ ఎక్కువగా మద్యం తాగుతుండడంతో తండ్రితో తరుచుగా గొడవలు పడగా, లోకేష్ కుటుంబ సభ్యులు తండ్రికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న లోకేష్ తన కుమారుడిని కొట్టాడు. అతను తాత అయిన చంద్రయ్య ఇంటికి వచ్చాడు. అయితే లోకేష్ కుమారుడు తన తండ్రి దగ్గరకు వెళ్లాడని తెలుసుకుని వెంటనే తండ్రి ఇంటికి వెళ్లగా నీవు నా ఇంటిలోకి మళ్లీ ఎందుకు వస్తున్నావని మాటామాటా పెరగడం, ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో పక్కనే ఉన్న బైక్ చంద్రయ్యపై పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే చంద్రయ్యకు గతంలో గుండె సమస్యలు ఉండేవని, ఆ క్రమంలో మృతి చెందాడా? లేక కుమారుడే చంద్రయ్య మృతికి కారణమా అన్న అనుమానాలు ఉండటంతో ఈ విషయంపై పోలీసులు అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేయడంతో పాటు కుమారుడు లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య అనసూయమ్మ విచారణ చేయాలని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.