రైతాంగానికి సాగునీటి పండుగ
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:22 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ని యోజకవర్గ పరిధిలోని సాగునీటి రం గానికి మరో కీలకమైన అడుగు పడిం ది.
- బాచారం హైలెవల్ కెనాల్‌కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
- రూ.164.60 కోట్ల నిధులకు గ్రీన్ సిగ్నల్..
- 7500 ఎకరాల ఆయకట్టుకు లభించనున్న సాగు, తాగునీరు
కొల్లాపూర్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యో తి): నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ని యోజకవర్గ పరిధిలోని సాగునీటి రం గానికి మరో కీలకమైన అడుగు పడిం ది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కొ ల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద కొత్తపల్లి మండలంలో బాచారం హైలె వల్ కెనాల్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఈ ప్రాజెక్టు ద్వారా బాచారం హైలెవల్ కెనాల్ కింద 5,990 ఎకరాల కు ముక్కిడిగుండం కెనాల్ కింద 1600 ఎకరాలకు (మొత్తం సుమారు 7590 ఎకరాలకు) సాగునీరు అందించడానికి వీలుగా రూ.164.60 కోట్ల వ్యయంతో ప నులు చేపట్టడానికి ప్రభుత్వం గ్రీన్ సి గ్నల్ ఇచ్చింది. మొత్తం మంజూరు ని ధులు రూ.164.60 కోట్లు కాగా, అందు లో కాల్వ నిర్మాణ పనులకు రూ.109. 106 కోట్లు, భూ సేకరణ వ్యయం రూ. 31.080 కోట్లు, జీఎస్టీ రూ. 24.415 కో ట్లుగా ఉన్నది. జొన్నలబొగుడ రిజర్వా యర్ నుంచి బాచారం హైలెవల్ కె నాల్ ద్వారా ఆయకట్టుకు పుష్కలంగా సాగు, తాగునీరు అందుబాటులోకి రా నుంది. ఈ నిర్ణయం పట్ల కొల్లాపూర్ ని యోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదా లు తెలియజేస్తున్నారు.