Share News

ప్రాణం తీసిన అప్పు

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:38 PM

అప్పుల బాధతో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మ హత్యాయత్నం చేయగా ఒకరు మృతి చెందా రు.

ప్రాణం తీసిన అప్పు

- అప్పు తీర్చే మార్గంలేక దంపతుల ఆత్మహత్యాయత్నం

- ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

నవాబ్‌పేట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : అప్పుల బాధతో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మ హత్యాయత్నం చేయగా ఒకరు మృతి చెందా రు. మరొకరి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొం దుతున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జి ల్లా నవాబ్‌పేట మండలం జంగమయ్యపల్లిలో గురువారం చోటుచే సుకున్నది. ఎస్‌ఐ వి క్రం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన ్నాయి. గ్రామానికి చెందిన ముర్మగి రవి(25)కి రెండు సంవ త్సరాల క్రితం వికారాబాద్‌ జిల్లా పూడూర్‌ మండలానికి చెందిన లావణ్యతో వివాహమైం ది. గ్రామంలో సొంత ఇల్లు నిర్మాణం కోసం రూ. 20 లక్షలు వెచ్చించాడు. దీంతో పా టుపాల డెయిరీకి ఏర్పాటు కోసం మరో రూ. 5 లక్షలు ఖర్చు చేశాడు. దీంతో రూ. 15 లక్షల అప్పు అయ్యింది. అప్పులు ఇచ్చిన వారు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. దీని గ మనించిన రవి తల్లి పద్మమ్మ అప్పులు చే యడం ఎందుకని బుధవారం మందలించిం ది. దీంతో మనస్తాపం చెందిన రవి, ఆయన భార్య అదే రోజు రాత్రి తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పడుకున్నారు. గురువా రం ఉదయం చింత చెట్టుకు వారిద్దరూ ఉ రి వేసుకున్నారు. రవి తన తమ్ముడు ఆనం ద్‌కు వీడియో కాల్‌ చేశాడు. దీంతో అతని త మ్ముడు గ్రామస్థుల సహాయంతో ఈ అఘాయి త్యాన్ని ఆపేందుకు వెంటనే వెళ్లాడు. అప్పటికే లావణ్య మృతి చెందటంతో రవిని జిల్లా ఆసుప త్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నది. మృతురాలికి ఓ కూతురు ఉన్నది. మృతురాలి తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 05 , 2026 | 11:38 PM