కనులపండువగా రథోత్సవం
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:28 PM
మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవం కనులపండువగా సాగింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలొచ్చారు.
మన్యంకొండ ఆలయానికి తరలొచ్చిన భక్తులు
గోవింద నామస్మరణతో మారుమోగిన కొండలు
మహబూబ్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవం కనులపండువగా సాగింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలొచ్చారు. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వచ్చారు. ముందుగా స్వామి వారిని గరుడవాహన సేవతో ఆలయం నుంచి గిరికిందకి ఊరేగింపుగా తెచ్చారు. ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణ మారుమోగింది. తిరుపతిలోలా భక్తులు తలనీలాలను స్వామి వారికి సమర్పించి, మెక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహరెడ్డి, ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు , ఆలయ సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఎంపీడీఓ కరుణశ్రీ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ శంకర్‌నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, భక్తులు పాల్గొన్నారు.