ప్రహరీ కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:10 PM
గద్వాల వ్యవసాయ మార్కెట్ ప్రహరీ కూల్చివేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత డిమాండ్ చేశారు.
మార్కెట్ యార్డును పరిశీలించిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత
గద్వాల, జనవరి 27(ఆంధ్రజ్యోతి): గద్వాల వ్యవసాయ మార్కెట్ ప్రహరీ కూల్చివేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత డిమాండ్ చేశారు. మంగళవారం ప్రహరీ కూల్చిన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. మార్కెట్ సెక్రటరీతో మా ట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ మార్కెట్ ప్రహరీ కూల్చివేత అంటే ఒక రకంగా రైతులపై పరోక్షంగా దాడి చేసినట్లుగా అభివర్ణించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేస్తుం టే ఇక్కడి వ్యాపారులు కొందరి అండ చూసుకొ ని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వ్యాపారులతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల నుంచి గద్వాల వ్యవసాయ మార్కెట్ రైతుల ఉత్పత్తుల విక్రయానికి అండగా నిలిచి ఇక్కడి రైతుల తో విడదీయరాని బంధం కలిగి ఉందన్నారు. అ లాంటి మార్కెట్‌పై కొందరు వ్యాపారులు అక్ర మంగా ప్రహరీని కూల్చి షాపింగ్ కాంప్లెక్స్ క ట్టేందుకు పూనుకుంటున్నారనిఅన్నారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకొని యథావిధిగా ప్రహరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆమెవెంట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్య క్షుడు తిరుమల్, సీనియర్ నాయకులు మధుసూదన్‌బాబు, మార్కెట్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, పులిపాటి వెంకటేష్, గోనుపా డు శ్రీనివాస్‌గౌడ్, టీఎన్‌ఆర్ జగదీశ్, కబీర్దాస్ నర్సింహులు తదితరు ఉన్నారు.