రేపల్లె సర్పంచుపై కేసు నమోదు చేయాలి
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:46 PM
కులాంతర వివాహం కారణంగా రేపల్లెలో దళిత యువకుడి ఇం టి కూల్చివేతకు కారణమైన సర్పంచుపై కేసు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.
గద్వాల సర్కిల్/గద్వాలటౌన్, సెప్టెంబ రు 13 (ఆంధ్రజ్యోతి):కులాంతర వివాహం కారణంగా రేపల్లెలో దళిత యువకుడి ఇం టి కూల్చివేతకు కారణమైన సర్పంచుపై కేసు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఆది వారం గద్వాల పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద సీపీఎం శ్రేణులు నిరసన తెలి పారు. అనంతరం పార్టీ బృందంతో కలిసి రేపల్లెకు వెళ్లిన జాన్‌వెస్లీ కూల్చివేసిన ఇం టిని పరిశీలించి బాధితులను పరామర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఇంటి కూల్చివేతలో పాల్గొన్న వారందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాం డ్ చేశారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా కలెక్టర్, ఎస్పీలు గ్రామాన్ని సందర్శించి బాధితులకు మనో ధైర్యం కల్పించక పోవడం విచారకరమన్నారు. రేపల్లె ఘటనను తీవ్రమైనదిగా పరిగణించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూలాంతర వివాహం చేసుకున్న జంటల కు రక్షణ కల్పించే దిశగా పకడ్బందీ చట్టాన్ని రూపొం దించాలన్నారు. అదేవిధంగా కుల అసమానత నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవిందు, కమిటీ నాయకులు రేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. నేలమట్టం అయిన యువకుడి ఇంటిని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని, ఘటనకు ప్రేరేపించిన వారిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపల్లి తరహా దాడులు పునరావృతం కాకుండా పోలీసు శాఖ, ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.