99.78 శాతం హాజరు
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:08 PM
పదో తరగతి పరీక్షలు జిల్లాలో శనివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించారు.
ప్రారంభమైన పది పరీక్షలు
మొదటిరోజు కేంద్రాల వద్ద సందడి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు జిల్లాలో శనివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించారు. మొదటి రోజు కావడంతో కేంద్రాలు విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు, బంధువులతో సందడిగా మారాయి. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఖుష్బూగుప్తా, అదనపు కలెక్టర్ మధుసుదన్‌నాయక్, డీఈఓ ప్రవీణ్‌కుమార్ కేంద్రాలను పరిశీలించారు. స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. బాలానగర్ మండల కేంద్రంలో పరీక్ష ప్రతాలు ఉంచిన పోలీ్‌స స్టేషన్‌లోని స్ర్టాంగ్ రూమ్‌ను పరీక్షల జిల్లా పరిశీలకురాలు, రాష్ట్ర అధికారి విజయలక్ష్మీబాయి తనిఖీ చేశారు. అదేవిధంగా రాజపూర్ జిల్లా పరిషత్ పాఠశాల, జడ్చర్ల సెంయిట్ ఆగ్నస్, బాదేపల్లి ఉన్నతపాఠశాల, కావేరమ్మపేట పాఠశాల పరీక్ష కేంద్రాలను పరిశీలిచారు.
13,188 మంది విద్యార్థులు హాజరు
పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 12,217 మంది హాజరు కావల్సి ఉండగా 13,188 మంది హాజరయ్యారు. 23 మంది గైర్హాజరు అయ్యారు. 99.78 హాజరు శాతం నమోదైంది. ప్రైవేట్‌గా పరీక్ష రాసే విద్యార్థులు 6 మందికి గాను ఐదుగురు హాజరు కాగా, ఒకరు గైర్హాజరు అయ్యారు. 83.33 హాజరు శాతం నమోదైంది.