98 శాతం నమోదైన ఓటింగ్
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:21 PM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పదేళ్ల సుధీర్ఘ విరామం అనంతరం జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల పోలింగ్ గద్వాల డిపో లో జోరుగా సాగాయి.
గద్వాలలో ఉత్సాహంగా ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
ఆధిక్యం చాటిన ఎంప్లాయీస్ యూనియన్
డిపో స్థాయిలో 109 ఓట్ల ఆధిక్యం
గద్వాలఅర్బన్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పదేళ్ల సుధీర్ఘ విరామం అనంతరం జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల పోలింగ్ గద్వాల డిపో లో జోరుగా సాగాయి. శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. పదేళ్ల తర్వాత జరుగుతున్న పోలింగ్ కావడంతో కార్మికులంతా ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2017 తర్వాత ఉద్యోగాల్లో చేరిన కొత్త కార్మికులు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియో గించుకునేందుకు ఉత్సాహం చూపారు. డిపోలో మొత్తం 371మంది ఓటర్లు ఉండగా, ముగ్గురు కార్మికులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోగా 363 మంది పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా ఐదుగురు కార్మికులు పోలింగ్‌కు గైర్హాజరైనట్లు ఎన్నికల అధికారి వేణుగోపాల్ తెలిపారు.
ఉత్కంఠంగా కౌంటింగ్
ఉమ్మడి జిల్లాలోని పది డిపోలకు భిన్నంగా రెండు ప్రధాన యూనియన్ల మధ్య నున్వా, నే నా అన్నట్లు సాగిన ఎన్నికల్లో ఫలితంపై కార్మికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం రా త్రి 9:30 గంటల అనంతరం ఫలితాలు వచ్చాయి. హోరాహోరీగా సాగిన ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధిక్యం చాటింది. దీంతో డిపో వద్ద ఈయూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ విజయోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గడ్డం కృష్ణారెడ్డి, ఏఐ టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.