Share News

పిచ్చికుక్కల దాడిలో 8మందికి గాయాలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:19 PM

నాగర్‌క రూల్‌ జిల్లా బల్మూరు మం డల కేంద్రంలోని ఏడుగురికి, కొండనా గులలో ఒకరికి పి చ్చి కుక్క గాయపరిచి న సం ఘటన చోటు చేసుకుంది.

 పిచ్చికుక్కల దాడిలో 8మందికి గాయాలు
గాయపడిని చిన్నారి

బల్మూరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌క రూల్‌ జిల్లా బల్మూరు మం డల కేంద్రంలోని ఏడుగురికి, కొండనా గులలో ఒకరికి పి చ్చి కుక్క గాయపరిచి న సం ఘటన చోటు చేసుకుంది. వై ద్య సిబ్బంది వివరాల ప్రకా రం... మండల కేంద్రంలో ఉన్న ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేసి పలువురిని గాయపరిచిం ది. దీంతో వైద్య సిబ్బంది వారికి చికిత్స అంది స్తున్నప్పటికీ మరో సంఘట న కొండనాగుల గ్రామంలో కూడా మహిళకు కుక్క కరిచినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ సిబ్బంది పిచ్చికుక్కలను గుర్తించి వెంటనే అదుపు చేయాలని లేకుంటే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోనేరు గ్రామంలో ఇద్దరు చిన్నారులకు...

అలంపూర్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లా అలంపూరు మండల పరిధిలోని కోనేరు గ్రామానికి చెందిన స్వాములు, తిమ్ములమ్మల కుమారుడు జీవన్‌బాబు, కుమార్తె మధుకుమారి శనివారం ఆరుబయట ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసింది. దీన్ని చూసిన ఇరుగు పొరుగు వారు కుక్కను తరిమికొట్టి చిన్నారులను రక్షించారు. 108కు ఫోన్‌ చేసి మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Apr 25 , 2026 | 11:19 PM