జనరల్ ప్రయోగ పరీక్షలకు 339 మంది హాజరు
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:00 PM
ఇంటర్మీడియట్ రెండో విడత ప్రయోగ పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి హృదయరాజు మంగళవారం పరిశీలించారు.
గద్వాల, అయిజలలో పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఐఈవో హృదయరాజు
గద్వాల సర్కిల్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ రెండో విడత ప్రయోగ పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి హృదయరాజు మంగళవారం పరిశీలించారు. జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాలలో అధికారులు ఫిజిక్స్, కెమిస్ర్టి, బాటనీ, జువాలజీ ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఉదయం సెషన్‌లో నిర్వహించిన జనరల్ ప్రయోగ పరీక్షలకు 339 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 330 మంది, వృత్తి విద్య ప్రయోగ పరీక్షలకు 83 మంది విద్యార్థులకు గాను 79 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన జనరల్ పరీక్షకు 268 మంది విద్యార్థులకు గాను 259 మంది విద్యార్థులు, వృత్తి విద్య పరీక్షకు 40 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 35 మంది విద్యార్థులు హాజరైనట్టు డీఐఈవో, ఇంటర్ పరీక్షల జిల్లా కన్వీనర్ హృదయరాజు తెలిపారు. గద్వాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, అయిజలోని ప్రభుత్వ జూనియర్, అరోరా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణను పరిశీలించారు.
- అయిజలో : ఇంటర్‌మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను జిల్లా ఇంటర్‌మీడియట్ నోడల్ అధికారి హృదయరాజ్ పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం అయిజలో ని అరోరా జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పర్యవేక్షించారు.