33 వాహనాల పట్టివేత
ABN , Publish Date - Jul 11 , 2026 | 11:10 PM
చట్టాన్ని గౌరవించి, శాంతి భద్రతలకు సహకరించే వారికే ఫ్రెండ్లీ పోలీస్ అని, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ చట్టాన్ని అతిక్రమించేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
సంజయ్‌నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్
మహబూబ్‌నగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): చట్టాన్ని గౌరవించి, శాంతి భద్రతలకు సహకరించే వారికే ఫ్రెండ్లీ పోలీస్ అని, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ చట్టాన్ని అతిక్రమించేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం ఉదయం టూటౌన్ పోలీస్ స్టేషన్ ప రిధిలోని సంజయ్‌నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. పోలీసులు ఏకకాలంలో అన్ని ఇళ్లను తనిఖీ చేశారు. ఇంట్లో నివాసం ఉం టున్న జనాల వివరాలు, వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. సరైన ధ్రు వపత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు తెచ్చి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక ప్రజలతో మా ట్లాడుతూ యువత శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా పనిచేయాలని, అదే సమయంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చె ప్పారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి భ విష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ప్రతి కాలనీ, వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీనివల్ల నేరాలను నియంత్రిచొచ్చని చెప్పారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని, నిబంధనలు పాటిం చాలని చెప్పారు. సైబర్ నేరాల పట్ల అ ప్రత్తంగా ఉండాలన్నారు. డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, వన్‌టౌన్ సీఐ అప్పయ్య, టూటౌన్ ఎస్‌ఐ విజయభాస్కర్ పాల్గొన్నారు.