పేట మునిసిపాలిటీలో నేటి నుంచి 13 కేంద్రాలు
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:21 PM
నారాయణపేట మున్సిపాలిటీలో, రెండు వార్డులకు కలిపి ఒక 'ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం' (Indiramma Family Insurance Scheme) నమోదు కేంద్రం సోమవారం నుండి పని చేయడం ప్రారంభించనుంది.
- రెండు వార్డులకు ఒక ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం నమోదు
- ఇదివరకే 10, 14 వార్డులలో కొనసాగుతున్న రెండు కేంద్రాలు
- 9120 కుటుంబాల్లో 200 కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా పూర్తి
నారాయణపేట, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నా రాయణపేట ముని సిపాలిటీలో సోమ వారం నుంచి రెం డు వార్డులకు కలి పి ఒక ఇందిరమ్మ కుటుంబ బీమా ప థకం నమోదు కేం ద్రం ప్రారంభం కా నుంది. ఈ మేరకు కమిషనర్ శంకర్ నేతృత్వంలో అధికా రులు ఏర్పాట్లు పూ ర్తి చేశారు. ఇప్పటికే ఈనెల 20 నుంచి నారా యణపేట మునిసిపాలిటీ పరిధిలోని 10, 14 వార్డులలో ఇందిరమ్మ కుటుంబ బీమా నమో దు ప్రక్రియ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేం ద్రాలను మునిసిపల్ చైర్‌పర్సన్ కొండ శ్వేత స త్యయాదవ్, వైస్ చైర్‌పర్సన్ మంజులజీఆర్‌రెడ్డి, కౌన్సిలర్లు అరుణమనోహర్‌గౌడ్, జయశ్రీ, కమిష నర్ శంకర్ ప్రారంభించి, పర్యవేక్షించారు. నారా యణపేట మునిసిపాలిటీ పరిధిలోని 24 వార్డు లలో రేషన్ కార్డులు కలిగిన 9,120 కుటుం బాలు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో 200 కుటుంబాలకు ఇందిరమ్మ కుటంబ బీమా పథకం ప్రక్రియ పూర్తి అయింది. ఒక్కో కేంద్రం లో ల్యాప్‌టాప్‌తో పాటు రిజిస్టర్‌లో నమోదు చే సుకునేందుకు మొత్తం నలుగురు సిబ్బంది పని చేస్తున్నారు.