Share News

ఇంటి ఆవరణలో 12 పాములు

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:41 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామంలో మేకల శివుడు ఇంటి ఆవరణలో ఏకంగా ఒకేసారి 12 జర్రిపోతు పాము పిల్లలు కనిపించి కలకలం రేపాయి.

ఇంటి ఆవరణలో 12 పాములు
గుడ్లనర్వలో స్నేక్‌ క్యాచర్‌ జగన్‌ పట్టుకొని ప్లాస్టిక్‌ డబ్బాలో వేసిన పాములు

బిజినేపల్లి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామంలో మేకల శివుడు ఇంటి ఆవరణలో ఏకంగా ఒకేసారి 12 జర్రిపోతు పాము పిల్లలు కనిపించి కలకలం రేపాయి. ఆదివా రం ఉదయం ఇంటి ఆవరణలో కాంపౌండ్‌ పక్కన ఉన్న పెద్ద రంధ్రంలో అనుమానంతో పరిశీలించగా పాములు కనిపించాయి. భయంతో వెంటనే గ్రామానికి చెందిన స్నేక్‌ క్యాచర్‌ జగన్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌ జగన్‌ వచ్చి పాములన్నింటినీ సురక్షితంగా పట్టుకొని ప్లాస్టిక్‌ డబ్బాలో వేశాడు. పాములు కనిపిస్తే చంపవద్దని, తనకు సమాచారం ఇస్తే వాటిని పట్టి క్షేమంగా ఆటవీ ప్రాంతంలో వదిలేస్తానని కోరారు.

Updated Date - Apr 05 , 2026 | 11:41 PM