12 గంటల విద్యుత్ అందించాలి
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:40 PM
రైతులకు ప్రభు త్వం ప్రకటించిన 12 గంటల విద్యుత్‌ను సక్రమంగా నిరంత రాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నాగరాల, కంభాళాపూర్, తాటి పాముల, కంభాళాపూర్ తండా గ్రామాలకు చెందిన రైతులు గురువారం శ్రీరంగాపూర్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
- సబ్ స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేసిన రైతులు
శ్రీరంగాపురం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రైతులకు ప్రభు త్వం ప్రకటించిన 12 గంటల విద్యుత్‌ను సక్రమంగా నిరంత రాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నాగరాల, కంభాళాపూర్, తాటి పాముల, కంభాళాపూర్ తండా గ్రామాలకు చెందిన రైతులు గురువారం శ్రీరంగాపూర్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. పక్క మండలాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉన్నప్పటికీ తమ మండలంలో ఎందుకు కో తలు విధిస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ తరచూ వచ్చి పోవడంతో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేద న వ్యక్తం చేశారు. పంటలు చేతికొచ్చే సమ యంలో విద్యుత్ సమస్యతో ఎకరాల కొద్దీ పంటలు కళ్ల ముందే నష్టపోయే పరిస్థితి ఏ ర్పడుతుందని వాపోయారు. సమస్య పరి ష్కరించే వరకు కరెంటు ఇవ్వకపోయినా ప ర్వాలేదని, కానీ ఇలా చాలీచాలని విద్యుత్ సరఫరా చేసి పంటలు, మోటార్లు నష్టపో యేలా చేయవద్దని రైతులు కోరారు. విద్యు త్ సమస్యను ఏఈకి ఫోన్‌లో వివరించగా పైఅధికారుల ఆదేశాల మేరకు సరఫరా చే స్తున్నామని సమాధానం ఇచ్చారని రైతులు తెలిపారు. వెంటనే విద్యుత్ సరఫరాను స క్రమంగా చేసి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.