పసిప్రాణాన్ని నిలిపిన 108 సిబ్బంది
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:54 PM
పసిప్రాణానికి ప్రాణం పోశారు 108 సిబ్బంది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి లో చోటుచేసుకున్నది.
- ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డకు సీపీఆర్ చేసి కాపాడిన వైనం
తెలకపలి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పసిప్రాణానికి ప్రాణం పోశారు 108 సిబ్బంది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి లో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. బొప్ప ల్లికి చెందిన సుప్రియకు బుధవారం పురిటి నొప్పులు అధికంగా రావడంతో కు టుంబ సభ్యులు తెల్లవారు జామున 108కు సమాచారం అందించారు. అక్కడి కి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు మరింత అధికమవడంతో దగ్గరలో ఉన్న తెలకపల్లి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నార్మల్ డెలివరీ చేయగా, సుప్రియ మగ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు హార్ట్‌బీట్, స్పృహ లేకపోవడం, ఏడవ కపో వడంతో బాబును వైద్య సిబ్బంది నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశా రు. తెలకపల్లి పీహెచ్‌సీలో ఉన్న 108 సిబ్బంది ఆ బిడ్డను తీసుకొని డాక్టర్ సలహా మేరకు కంటిన్యూగా సీపీఆర్ చేస్తూ కృత్రిమంగా శ్వాస అందిస్తూ... ఆక్సిజన్ అందిస్తూ.. నాగర్ కర్నూల్‌కు బయల్దేరారు. దీంతో మార్గ మధ్యంలో బిడ్డ కదలికలు, ఏడవడం చిన్నగా మొదలయ్యాయి. అలానే ఆపకుండా కం టి న్యూగా సీపీఆర్ చేస్తూ.. కృత్రిమంగా శ్వాస అందిస్తూ నాగర్ కర్నూల్ దగ్గరలోకి వెళ్లగానే బాబు బాగా ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీ ల్చుకున్నారు. ఇదిలా ఉంటే, కంటిన్యూగా సీపీఆర్ ఆక్సిజన్ అందిస్తూ బిడ్డని బతికించి తీసుకువచ్చారని నాగర్‌కర్నూల్ ఆసుప్రతి చిన్నపిల్లల డాక్టర్‌తో పాటు సిబ్బంది వారిని అభినందించారు.