వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:17 PM
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
రెండు బైకులు ఢీకొని..
ధన్వాడ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా ధన్వాడ లో సోమవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. గాయపడిన వారిలో డాక్టర్ కెంచె సుదర్శన్‌కు తీవ్ర గాయాలు కాగా, మందిపల్లి గ్రామానికి చెందిన పవన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108లో మహబూబ్‌న గర్ ఎస్‌వీఎస్‌కు తరలించారు. సుదర్శన్ పరిస్థితి విషమించడంతో అ క్కడి నుంచి హైదరాబాద్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మారుతీనగర్ ఉత్సవ సమితీ, కాల నీవాసులు, పలువురు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
వెల్దండ, (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని రాఘాయిపల్లి గేట్ సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల గ్రామానికి చెందిన ఊర వెంకటయ్య (50) అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో రాఘాయిపల్లి గేట్ వద్ద దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వెంకటయ్యను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సంజీవ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బైకులు ఢీకొని..
పెద్దమందడి, (ఆంధ్రజ్యోతి) : పెద్దమందడి గ్రామ శివారులో జరిగి న రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మణం చెందాడు. ఈ సంఘట నపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దమందడికి చెందిన బత్తుల అలివేల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆమె చిన్న కుమారుడు బత్తుల తరుణ్ (18) సో మవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద పశువులకు నీరు తాపి మోటార్ సైకిల్‌పై గౌరాయకుంట తండా సమీపంలోని బత్తుల శంకర్ గొర్రెల మంద వద్దకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొ ట్టింది. ఎదురుగా వచ్చిన బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. ఎదురుగా వచ్చి న బైక్‌ను గ్రామస్థుడు జంగం శంకర్ (తండ్రి పెద్ద హనుమంతు)అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఢీకొనడంతో తరుణ్ అక్కడికక్క డే మరణించాడు. ఈ మేరకు పెద్దమందడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ జలందర్‌రెడ్డి తెలిపారు.
ట్యాంకర్, బైకు ఢీకొని..
జడ్చర్ల,(ఆంధ్రజ్యోతి) : ట్యాంకర్, బైకు ఢీకొన్న సంఘటనలో మహ బూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేటకు చెందిన శివ(24) మృ తి చెందాడు. అదే గ్రామానికి చెందిన రజినీకాంత్ తీవ్రంగా గాయపడ్డా డు. మంగళవారం జడ్చర్ల మండలం ఆల్వాన్‌పల్లి సమీపంలో జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మిడ్జిల్ మండలం రాణిపేటకు చెందిన శివ, రజినీకాంత్‌లు ద్విచక్రవాహనంపై రాణిపేట నుంచి జడ్చర్లకు వస్తున్నారు. జడ్చర్ల నుంచి కల్వకుర్తివైపు ట్యాంకర్ వెళ్తుంది. జడ్చర్ల మండలం ఆల్వాన్‌పల్లి సమీపంలో ట్యాంకర్, బైకు ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో శివ తలకు తీవ్ర గాయం కాగా రజినీకాం త్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108లో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలిస్తుండగా శివ మృతి చెందాడు. రజినీకాంత్ ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప డ్తున్నట్లు జడ్చర్ల ఎస్‌ఐ ఖాదర్ తెలిపారు.