Share News

పది విద్యార్థులకు అల్పాహారం అందజేత

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:29 PM

నారాయణపేట జిల్లా దామరగిద్ద పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు బుధవారం సాయంత్రం అల్పాహారం అందించారు.

పది విద్యార్థులకు అల్పాహారం అందజేత
విద్యార్థులకు కర్రీ పఫ్స్‌ అందిస్తున్న జీహెచ్‌ఎం సురేష్‌

దామరగిద్ద, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా దామరగిద్ద పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు బుధవారం సాయంత్రం అల్పాహారం అందించారు. ప్రత్యేక నిధుల కింద రోజూ అల్పాహారం అందించనున్నట్లు హైస్కూల్‌ జీహెచ్‌ఎం సురేష్‌ తెలిపారు. మొదటి రోజు కర్రీపఫ్స్‌ ఇచ్చామన్నారు. 140 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. మార్చి 16 వరకు ఒక్కో విద్యార్థికి రోజు రూ.15 చొప్పున ఖర్చుపెట్టి ఉడకబెట్టిన పల్లీలు, పెబ్బర్లు, పెసర్లు, నువ్వుల పట్టీలు, పల్లి పట్టీలు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బాలరాజు, అమృత్‌, తిప్పన్న, శంభులింగం, శ్రీనివా్‌సరెడ్డి, హరి, గోవింద్‌, సక్సేన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 11:29 PM