Share News

నా పీఏ, పీఆర్‌వోపై ఠాణాలోనే దాడి

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:08 AM

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, పోలీస్‌ ేస్టషన్లలోనే దాడులకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో తన పీఏ, పీఆర్‌వోలను పోలీసు స్టేషన్‌ను తీసుకెళ్లిన సమయంలో దాడి జరిగిందని ఆరోపించారు.

నా పీఏ, పీఆర్‌వోపై  ఠాణాలోనే దాడి
Ktr

  • రేవంత్‌ పాలనలో

దిగజారిన శాంతిభద్రతలు

  • 22ఏ అక్రమాలపై

న్యాయ విచారణ జరపాలి

  • ఆస్తులను కొల్లగొడుతున్నారు

  • మేం అధికారంలోకి వచ్చాక

  • ఎవరినీ వదిలిపెట్టం: కేటీఆర్‌

  • కేటీఆర్‌ పీఆర్‌వో, పీఏపై

దాడి జరగలేదు: డీసీపీ

  • నా పీఏ, పీఆర్‌వోపై

పోలీస్‌ స్టేషన్‌లోనే దాడి

  • కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు: కేటీఆర్‌

  • కేటీఆర్‌ పీఆర్‌వో, పీఏపై దాడి జరగలేదు: డీసీపీ శిల్పవల్లి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, పోలీస్‌ ేస్టషన్లలోనే దాడులకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో తన పీఏ, పీఆర్‌వోలను పోలీసు స్టేషన్‌ను తీసుకెళ్లిన సమయంలో దాడి జరిగిందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ ఇంటిపైనే వేలమంది గూండాలు దాడి చేసే స్థాయికి రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీ వచ్చిన కేటీఆర్‌ ఏఎన్‌ఐ వార్త సంస్థతో, ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై చేసిన పోస్టులో రేవంత్‌ సర్కారుపై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, ఖాకీలు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. విచారణ పేరుతో పోలీ్‌సస్టేషన్‌కు వెళితే అక్కడ తన పీఆర్‌వో మహేష్‌ ముదిరాజ్‌, పీఏ మహేందర్‌రెడ్డిలపై ఏకంగా 15 మంది దాడి చేశారని పేర్కొన్నారు. ‘‘పోలీస్‌ ేస్టషన్‌లోనే దాడి చేసిన ఆ 15 మంది గూండాలా? లేక పోలీసులా? అనేది తేలాలి’’ అని డిమాండ్‌ చేశారు. దీనిపై కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే భౌతిక దాడులకు దిగుతోందని, ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్‌ హెచ్చరించారు. 22ఏ వ్యవహారంపై జ్యుడీషియల్‌ విచారణకు కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రెండేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమన్నారు.


సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌ వద్ద హైడ్రామా..

అసెంబ్లీ వద్ద పోలీసులతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించిన విషయమై మాజీ మంత్రి కేటీఆర్‌ పీఏ మహేందర్‌, పీఆర్‌వో మహే్‌షలను సోమవారం సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. ఈ సందర్భంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులేసుకొని వచ్చి దాడి చేశారంటూ ప్రచారం సాగింది. ఈ విషయం తెలిసి బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగడంతో హైడ్రామా నెలకొంది. ఖైరతాబాద్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, తాము పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పుటేజీలను పరిశీలించామని తెలిపారు. మహేందర్‌, మహే్‌షను పోలీస్‌ స్టేషన్‌లో విచారిస్తున్న సమయంలోనే.. కొందరు యువత గణేష్‌ మండపం వద్ద డీజే అనుమతి కోసం వచ్చినట్టు చెప్పారు. పోలీసులపై దౌర్జన్యం చేసిన వారిని కూర్చోబెట్టి మర్యాదలు చేస్తున్నారని వాగ్వాదానికి దిగడంతో.. పోలీసులు వారిని మందలించారని తెలిపారు. దాడి జరిగిందన్న ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని తెలిపారు

Updated Date - Sep 16 , 2026 | 05:08 AM