ఖమ్మంలో టీటీడీ ఆలయ భూమిపూజకు రండి
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:56 AM
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో ఖమ్మం నగరం అల్లీపురంలో నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఈ నెల 12న భూమి పూజ చేయనున్న విషయం తెలిసిందే.
చినజీయర్‌స్వామిని ఆహ్వానించిన మంత్రి తుమ్మల
ఖమ్మం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో ఖమ్మం నగరం అల్లీపురంలో నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఈ నెల 12న భూమి పూజ చేయనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాజరుకావాలని త్రిదండి చినజీయర్ స్వామిని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. ఆయన మంగళవారం హైదరాబాదులో చినజీయర్‌స్వామిని కలిశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఖమ్మంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించబోతున్నామని, ఈ ఆలయం నిర్మాణం ద్వారా నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభ రానుందని తుమ్మల ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ నమూనాను చినజీయర్ పరిశీలించారు. తుమ్మల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన చినజీయర్ వేడుకకు హాజరవుతానని తెలిపారు.