Share News

జీవన్‌రెడ్డి వ్యాఖ్యలకు వైఎస్‌ఆర్‌ ఆత్మ ఘోషిస్తుంది

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:36 AM

జీవన్‌రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్‌ఆర్‌ ఆత్మ ఘోషిస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆరో పించారు.

జీవన్‌రెడ్డి వ్యాఖ్యలకు వైఎస్‌ఆర్‌ ఆత్మ ఘోషిస్తుంది

వేములవాడ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జీవన్‌రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్‌ఆర్‌ ఆత్మ ఘోషిస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆరో పించారు. వేములవాడ పట్టణంలోని డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన కేటీఆర్‌, జీవన్‌రెడ్డి మాటలకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లా డుతూ బీఆర్‌ఎస్‌ నిర్వహించిన సమావేశంలో వాస్తవాలను వక్రీకరించి ప్రజల ను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. సర్‌ కార్యక్రమంలో పేరు తో నిర్వహించిన సభను బీఆర్‌ఎస్‌ నాయకులు అబద్ధాల ప్రచారవేదికగా మా ర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ అబద్ధాలతోనే గతంలోనే బీఆర్‌ఎస్‌ మనుగడ సాధించిందని, ప్రజలు వాస్తవాలను గుర్తించి అధికారానికి దూరం చేశారన్నారు. తప్పులను సమీక్షించుకోకుండా మళ్లీ అసత్య ప్రచారానికి పాల్పడ టం దురుదృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అబద్దాలు ఆడతా రు అనుకుంటే జీవన్‌రెడ్డి వాళ్లతో కలిసిపోయారని మండిపడ్డారు. తాము రాసి చ్చిన బాండ్‌ పేపర్‌పై ఉన్న హామీలను అమలుచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసేలా చేసిందని, సీఎం రేవంత్‌ రెడ్డి అభివృద్ది సంక్షేమాన్ని ఎక్కడ ఆపకుండా పని చేస్తున్నారని తెలిపారు. 50 యేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేయని అప్పుని 10 యేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిందని అన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతు న్నారని మండిపడ్డారు. వరద కాలువను కేసీఆర్‌ ఆలోచనగా చెప్పడం చరిత్రను వక్రీకరించడమేనన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చొరవతోనే వరద కాలువ నిర్మా ణం జరిగిందని, 2012లో ఎస్‌ఆర్‌ఎస్పీ ద్వారా ఆ కాలువలో నీటిని తసుకువ చ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వేములవాడ అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలు పూర్తిగా వినాధారమన్నారు. వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రజలు అభివృద్ది, సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్‌ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తూమ్‌ మధు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌, నాయకులు కూరగాయాల కొమురయ్య, చిలుక రమేష్‌, పీర్‌ మహ్మద్‌, బింగి మహేష్‌, పులి రాంబాబు, పాత సత్యలక్ష్మి ఉన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:36 AM