యువజన క్రీడా వారోత్సవాలను విజయవంతం చేయాలి
ABN , Publish Date - May 18 , 2026 | 12:52 AM
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చేపట్టే యువజన క్రీడా వారోత్సవాలను విజయవంతం చేయాల ని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు.
సిరిసిల్ల అర్బన్, మే 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చేపట్టే యువజన క్రీడా వారోత్సవాలను విజయవంతం చేయాల ని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. కలెక్టరేట్‌లోని సమావే శ మందిరంలో ఆదివారం యువజన క్రీడా వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌లను కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ఆవిష్కరిం చారు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లా డుతూ ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు యువజన క్రీడావారోత్సవాలను నిర్వ హించడం జరుగుతుందని, ఇందులో క్రీడా కారులు పాల్గొనాలని కోరారు. జిల్లా స్థాయిలో సోమవారం ఉదయం 7గంటలకు పట్టణంలో ని అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2కే రన్‌ను జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, ఇం దులో క్రీడాకారులతో పాటు బాలబాలికలు, వ్యాయామఉపాధ్యాయులు, సీనియర్ కోచ్‌లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. అలాగే ఈనెల 23న పట్టణంలోని కే కన్వెన్షన్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వ హించే జాబ్ మేళాను నిరుదోగులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్ర మంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాం దాస్, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.